అదుర్స్ అనిపించిన ఓఎన్‌జీసీ ఫలితాలు 

Updated By ManamFri, 11/09/2018 - 22:33
ONGC_CLAT-Recruitment

ONGC_CLAT-Recruitmentన్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) క్యూ2 ఫలితాలు రాణించాయి. 2018-19 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఏకంగా 61 శాతం వృద్ధితో రూ.8265 కోట్ల నికర లాభాలు సాధించింది. చమురు ఉత్పత్తి తగ్గడంతో పాటు అధిక ధరల నేపథ్యంలో కంపెనీ లాభాలు అమాంతం పెరిగాయి. అంతకు  ముందు 2017-18 క్యూ2లో రూ.5131 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ ప్రతీ బ్యారెల్ చమురుపై రాబడి 48 శాతం పెరిగి 73.07 అమెరికా డాలర్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ ధర 49.43 డాలర్లుగా ఉంది. 2017-18 క్యూ2లో ఈ పిఎస్‌యు టర్నోవర్ 47.6 శాతం పెరిగి రూ.27,989 కోట్లకు చేరింది. కాగా, కంపెనీ చమురు ఉత్పత్తి 7 శాతం తగ్గి 4.9 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 3 శాతం పెరిగి 6.1 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా నమోదయ్యింది.

English Title
ONGC Results
Related News