ఐరన్ మాత్రలు వికటించి.. 161మందికి అస్వస్థత

Updated By ManamFri, 08/10/2018 - 17:23
One Student Dead, 160 Hospitalised in Mumbai, Iron Supplements, BMC School
  • చిన్నారి మృతి, 161 మందికి అస్వస్థత

One Student Dead, 160 Hospitalised in Mumbai, Iron Supplements, BMC Schoolముంబై: ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను మింగిన 161 మంది స్కూల్ విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను మింగిన వారిలో 12ఏళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన ముంబై నగరంలోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బాయింగన్‌వాడీ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో సోమవారం మున్సిపల్ ఉర్దూ పాఠశాల నెంబర్-2లో విద్యార్థులందరికి ఐరన్ టాబ్లెట్లు ఇచ్చారు. 12ఏళ్ల చిన్నారి పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను మింగడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దాంతో మంగళవారం స్కూల్‌కు వెళ్లలేదు. గురువారం రాత్రి ఇంట్లో ఉండగా రక్త వాంతులు చేసుకొని చిన్నారి మృతిచెందింది.

చిన్నారుల్లో రక్తహీనత లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా బీఎంసీ స్కూల్ యాజమాన్యమే ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను పిల్లలకు ఇచ్చినట్టు ఓ నివేదిక వెల్లడించింది. టాబ్లెట్లు వికటించటానికి గల కారణాలు తమ దృష్టికి రాలేదని బీఎంసీ అధికారి పేర్కొంది. క్షయ (టీబీ) వ్యాధి కారణంగానే చిన్నారి మృతిచెంది ఉంటుందని అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన 161 మంది విద్యార్థులను గోవండీలోని రాజ్వాడీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను వేసుకున్న వారిలో కొందరికి వికారం, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపించగా, మిగిలినవారిలో పెద్దగా లక్షణాలు బయటపడలేదని బీఎంసీ అధికారి చెప్పారు.

English Title
One Student Dead, 160 Hospitalised in Mumbai Iron Supplements
Related News