సూర్యతో మ‌రోసారి..  

Updated By ManamSat, 01/20/2018 - 21:55
suriya

yuvanత‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌, ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా యువ‌న్ శంక‌ర్ రాజా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యారు. అటు సూర్య కాంబినేష‌న్‌లోనూ.. ఇటు సెల్వ రాఘ‌వ‌న్ కాంబినేష‌న్‌లోనూ యువ‌న్‌కి మంచి విజ‌యాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకి కూడా ఆయ‌న క‌లిసొస్తారేమో చూడాలి. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.
 

English Title
once again with suriya
Related News