ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

Updated By ManamMon, 07/09/2018 - 22:32
etela
  • అందరూ గుండెపోటుతోనే మరణం

  • సంతాపం తెలిపిన అల్లం నారాయణ

imageహైదరాబాద్: సామాజిక బాధ్యతతో పని చేసే జర్నలిస్టులను ఆర్థిక సమస్యలు.. పని భారం కకావికలం చేస్తోంది. ఒత్తిడితో హృద్రోగాల బారిన పడిన నలుగురు జర్నలిస్టులు సోమవారం ఒక్కరోజే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజులో ఇలా గుండెపోటుతో నాలుగురు మరణించడం అందరినీ కలవరపెడుతోంది. ఇందులో ముగ్గురు జర్నలిస్టులు మెదక్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. మరొకరిది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ విజయక్రాంతి జిల్లా ప్రతినిధి అశోక్ కుమార్, మెదక్ ఉమ్మడి జిల్లా దుబ్బాక మన తెలంగాణ విలేకరి వెంకట స్వామి, టేక్మాల్ సీనియర్ విలేకరి శ్రీనివాస్, చిన్నశంకరంపేట్ విలేకరి సిద్దులు గుండెపోటుతో మృతి చెందారు.

ఈ సంఘటనలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆకాల మరణాలు జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని, చాలా బాధాకరమైన విషయమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అకాడమీ పరంగా వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హమీ ఇచ్చారు. కాగా, కరీంనగర్ విలేకరి అశోక్ కుమార్ కుటుంబసభ్యులను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

English Title
ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి
Related News