ఒక సెక్యులర్ చిహ్నం

Updated By ManamWed, 07/11/2018 - 00:55
secularism

ఈనెల జూలై రెండున కైరున్నిసా బాబయ్య గారు చనిపోయారు. కైరున్నిసా గురించి బయటి ప్రపంచా నికి ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ ఆమెకు ఈ ప్రపంచాన్ని గురించిన అవగాహన ఉండేది. ఆమె సెక్యులర్ జీవన విధానం నుంచి విప్లవ రాజకీయాల దాకా విశాల మైదానాన్ని చూసింది. ఈ మైదానంలో కొంత దూరం నడిచింది. కైరున్నిసా రాయలసీమలో పుట్టి పెరిగింది. రాయలసీమ ఫాక్షనిజం గురించి చాలా చర్చ జరిగింది, జరుగుతున్నది. కానీ మత సామరస్యంలో ఆ ప్రాంతానికుండే అందరూ గుర్తించని విశిష్ట లక్షణం దేశమంతా మతకల్లోలాలు జరిగినా రాయలసీమలో వాటి ప్రభావం చాలా అరుదు. హిందూ ముస్లిం క్రిష్టియన్‌ల మధ్య నెలకొన్న మత సామరస్యం ఒక విలక్షణ సామాజిక సంబంధంగా కనిపిస్తుంది. మతోన్మాదంలో కొట్టుకుపోతున్న మత ఘర్షణలకు పరిష్కారం కొంతవరకు రాయలసీమ జిల్లాలలో అనుభవంలో దొరకవచ్చు. ఈ ప్రాంత మతసామరస్య ప్రభావం కైరున్నిసా మీద ఆమె వ్యక్తిత్వం మీద చాలా బలంగా ఉంది.

కైరున్నిసా ఆమె సోదరుడి మాటల్లో ‘చిన్నప్పటి నుంచి ఒక రెబల్ మనస్తత్వం’. దిగువ మధ్యతర గతికి చెందిన కుటుంబంలో పుట్టిన ఆమె ఇంట్లో ఇత ర సభ్యులు చదివినా చదవకున్నా తాను మాత్రం హై స్కూల్ విద్యను మంచి మార్కులతో పూర్తిచేసి విశాఖ పట్టణంలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. బెంగళూరు హెచ్.ఎ.ఎల్‌లోని ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. తన కాళ్ళమీద తాను నిలబడాలని, స్త్రీకి ఆర్థిక స్వాతం త్య్రం కావాలని బలంగా విశ్వసించింది. ఆమె నర్సిం గ్ కోర్సు చేస్తున్నప్పుడే బాబయ్య గారితో స్నేహమేర్ప డి సహచర్యం దాకా పోయింది. బాబయ్యకు చిన్నప్పు డే తల్లిదండ్రులు చనిపోవడం వలన జీవితం కొంత కాలం దారంలేని గాలిపటంలా అటు ఇటు ఊగినా, కైరున్నిసా పరిచయం కావడం, ఆమె అప్పటికే ఉద్యో గం చేస్తుండడం వల్ల బాబయ్య ఉన్నత విద్యకు ఆమె తోడ్పడ్డది. బాబయ్య బాల్యాన్ని గురించి వింటే మ్యా క్సింగోర్కీ బాల్యం గుర్తుకొస్తుంది. ఎవరి ఇంట్లోనో పనిపిల్లవాడుగా, నానాచాకిరి చేసినా, గోర్కీలాగే జీవి తాన్ని నిశితంగా చూడడమేకాక ఆయనలో మానవ త్వం వికాసం చెంది ఒక విశాలమైన మనిషిగా ఎదిగా డు. మానవసంబంధాల్లో అడ్డుగోడలుగా ఉండే, కులం, మతం, వర్గం దాటడం వల్లే కైరున్నిసాని జీవ న సహచారిగా చాలా సహజంగానే ఎన్నుకున్నాడు. ఇద్దరిది మతాంతర సెక్యులర్ వివాహబంధం. ఈ బంధం కైరున్నిసా రెబల్ మనస్తత్వానికి బాబయ్య మానవత్వానికి మధ్య ఏర్పడ్డ అనుబంధం. 

కైరున్నిసా బాబయ్య కలిసి జీవించడానికి తీసుకున్న నిర్ణయం అర్థశతాబ్దం కింద ఏ వివాదం లేకుండా నిరాడంబరంగా జరిగింది. మనదేశంలో పరిస్థితులు ఇప్పుడున్నం త జఠిలంగా లేవు. ఇవ్వాళ్ళ మతోన్మాదంలో కొట్టుకుపోతున్న మానవ సంబం ధాలు ఈ సహచర్యాన్ని ప్ర శ్నించడమే కాక నానా గందరగోళం చేసే ఒక కలుషిత వాతావరణాన్ని సృష్టించాయి. మనుషులు మతాలు పుట్టొచ్చు కాని ముందుగా మనం మనుషులం అనే సృ్పహ కోల్పో తున్నారు. సమాజంలోని సంకుచిత హద్దులు దాటి మనుషులుగా ఎదిగిన వారికి మతంతో సంబంధం లేదు. మతం ఒక వ్యక్తిగత విశ్వాసం, అంతకు తప్పించి అది మనుషుల మధ్య విషసర్పంగా మారకూడదు. ఈ ఇద్దరి వివాహం ఇవ్వాళ సమా జానికి ఒక నమూనాగా, ఒక స్ఫూర్తిగా నిలవాలి. 

కైరున్నిసా తన మతాన్ని వ్యక్తిగత జీవితంలో పూర్తిగా వదులుకోలేదు. ఇంట్లోనే నమాజు చేసుకునేది. తన సేవింగ్స్ నుండి ఒక మసీదుకు సహాయం చేయాలని కూడా ఆరాటపడ్డది. అట్లని తన మత విశ్వా సాలను తన భర్తమీదకాని, తమ ముగ్గురు పిల్లల మీ ద కాని రుద్దాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తానే ఒక సందర్భంలో తన పేరును రాధగా మార్చుకోవా లనుకుంది. అప్పుడప్పుడు నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకునేది. బొట్టు ఆమెకు అందమైన చిహ్నం గానే అనిపించింది కాని అది హిందూమత సంప్ర దాయంగా కనిపించలేదు. లేదా అది తన మత విశ్వా సానికి అడ్డుకూడా అని భావించలేదు. తన ఇద్దరు ఆడబిడ్డలని, అలాగే కొడుకుని ఒక సెక్యులర్ వాతావ రణంలో పెంచింది. వాళ్ళ చదువు గురించి తాపత్ర యపడ్డది. వాళ్ళ ఉన్నతికి ఒక వారధిగా నిలబడింది. ముగ్గురు తమ తమ జీవితాల్లో ఇవ్వాళ రాణించ డానికి ఆమె కృషి చాలా ఉంది. ఇద్దరు అమ్మాయిలలో ఒక్క అమ్మాయి డాక్టర్ జగతి మెడికల్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేయడమే కాక మహబూబ్‌న గర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నది. మరో అమ్మాయి ప్రణవ ఢిల్లీలో ఆంగ్ల సాహిత్య అధ్యాపకురాలిగా పనిచేసు ్తన్నది. వాళ్ళ అబ్బాయి భాను ప్రముఖ జర్నలిస్టుగా ఎదిగాడు. వీళ్ళ విద్యా విషయంలోనే కాక వీళ్ళు ము గ్గురు చాలా పరిణితి చెందిన పిల్లలు. ముగ్గురికి కొన్ని బలమైన విలువలున్నాయి. ఇంట్లో ఉండే సెక్యులర్ వాతావరణం వాళ్ళ వ్యక్తిత్వాలని మలచి ఉంటుంది. 

కైరున్నిసాకి బాబయ్యకి మధ్య స్నేహబంధం ఉ న్నా తగవులు లేవని కావు. ఇవి వాళ్ళ వ్యక్తిగత టెన్ష న్స్ (ఖ్ఛీటజీౌట) కంటే అవి వ్యవస్థాపర పరిమితు లుగా అగుపిస్తాయి. బాబయ్య తన చిన్నప్పటి బాల్య మే కాక, జీవితం ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని చాలా బలంగా ప్రభావితం చేయడం వలన, ఈ ప్రపంచం తలకిందులుగా ఉంది అని గమనించాడు. ప్రపంచంలోని పేదరికానికి, అసమానతలకు, అన్యా యానికి కారణాలను వెతుకుతూ జిడ్డు క్రిష్ణమూర్తి, చలం, శ్రీశ్రీల ప్రభావంతో మౌలిక ప్రశ్నలు అడు గుతూ విప్లవ రాజకీయాల పట్ల అనుభూతిని పెంచు కున్నాడు. విప్లవ నాయకులని గౌరవించి ఆదరించా డు. బాబయ్యను కలిసిన ఎవరైనా ఆయన మాన వత్వం పట్ల ఆకర్షితులు కాకుండా ఉండలేరు. బాబ య్య విప్లవ రాజకీయాలు ఆయనను మరింత మాన వీయంగా మార్చాయి. కైరున్నిసాకి విప్లవ నాయకుల పట్ల గౌరవం. చాలామంది విప్లవకారులు బాబయ్య కైరున్నిసా కుటుంబ ఆదరణను పొందినవారే. కాని ఈ రాజకీయాలు కైరున్నిసాను కొంత అభద్రతకు గురిచేశాయి. మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాయి. ఇది కైరున్నిసా వ్యక్తిగత సమస్య కాదు సామాజిక మార్పునకు జరిగే రాజీలేని పోరాటానికి కుటుంబ సంబంధాలకు మధ్య ఒక నిరంతర ఆటుపోటులాం టిది ఉంటుంది. ఈ వ్యవస్థాగత సవాలును భిన్న కుటుంబాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కైరున్నిసా ఈ సమస్యను ఎదుర్కొంటూనే మమ్మల్నందరిని గౌరవించింది. బాలగోపాల్ తన లా కోర్సును ఈ ఇంటి నుండే పూర్తిచేశాడు. తెలుగు రాష్ట్రాలలో ఉండే పేరున్న ప్రతి వ్యక్తికి, కుటుంబానికి ఈ ఇల్లు ఒక ఆత్మీయ ఆశ్రయమే. నన్ను కైరున్నిసా, (నాకంటె కొం త వయసులో పెద్దదైనా) అన్నా అని పిలిచేది. ఆ పి లుపు చాలా సహజంగా ఉండేది. ఇంటి సమస్యలు ఏ అరమరికలు లేకుండా చెప్పేది. తన ముగ్గురి పిల్లల గురించి అలాగే తమ మనుమలు, మనమరాళ్ళ గు రించి చాలా ఆనందంగా, గర్వంగా చెప్పేది. ముగ్గురి పిల్లలవి కులాంతర వివాహాలు. అంటే ఈ కుటుంబం కులం, మతం అడ్డుగోడలను కూలగొట్టింది.

కైరున్నిసా సెక్యులర్ దృక్పథం వల్లే కావచ్చు అమ్మాయిలని, అబ్బాయిని సరిసమానంగా చూసు కుంది. తన సేవింగ్స్‌ని ముగ్గురికి అబ్బాయి, అమ్మా యి అనే తేడా లేకుండా సమానంగా పంచింది.  ‘అ న్నా నాకు అమ్మాయిలైనా అబ్బాయైనా ఒకటే అందు కే అందరికి సమానంగా ఇచ్చిన’ అని చాలా ఆనందంగా చెప్పేది. ఆమె చివరిదశలో తనకు మిగిలి న ఆస్తిపాస్తులను మనుమలకి, మనమరాళ్ళకి పంచా లని నిర్ణయించుకుంది. ఇది కొంత దూరదృష్టి కూడ. 

కైరున్నిసాకి మతం, కులం పట్లే కాక లింగ వివక్ష కూడా లేదనేది స్పష్టమే. మనిషి మనిషిగా మారితే ఎన్ని సంకుచిత సంబంధాలను జయించవచ్చో ఆమె నుంచి నేర్చుకోవచ్చు. వీటన్నింటికి మించి మరణం తర్వాత అంతిమ సంస్కారాలు ఎలా చేయాలనే ఏ త గవు లేకుండా తన దేహాన్ని తన వృత్తికి చెందిన వైద్య విద్య అభివృద్ధి కోసం హాస్పిటల్‌కి డొనేట్ చేసింది. ఇది ఆమె సెక్యులర్ ప్రాపంచిక దృక్పథానికి పరాకాష్ట.

బాబయ్య కైరున్నిసా కుటుంబం ఇప్పుడున్న మతోన్మాద కలుషిత వాతావరణానికి ఒక ధీటైన జవాబు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని మార్క్స్ అన్నట్లు, చరిత్ర నిర్మాణంలో ఏ ఆర్భాటం, ప్రచారం లేకుండా పాటించే జీవిత ఆచరణే సామాజిక మార్పు నకు చలనసూత్రంగా పనిచేస్తుంటుంది. సాధారణై మెన మనుషులలో కొందరు అసాధారణంగా జీవి స్తారు అంటే ఇదేనేమో. 

English Title
ఒక సెక్యులర్ చిహ్నం
Related News