మూతబడనున్న నగ్న హోటల్..

nude restaurant in Paris shuts shop. Reason? No customers

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన నగ్న (న్యూడ్) రెస్టారెంట్ కస్టమర్ల కొరత కారణంగా మూతపడనుంది. పారిస్‌లో ఉన్న ఈ హోటల్‌ను ఆ ఏడాది ఫిబ్రవరిలో మూసివేయనున్నారు. కాగా ఈ రెస్టారెంట్ నిర్వహణపై స్థానికంగా వస్తున్న వ్యతిరేకత కూడా కారణం అయింది. అయితే పూర్తిస్థాయి సహజత్వాన్ని కోరుకునే కస్టమర్స్ ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండాల్సిందే.

2016లో ఓ'నిచర్ల్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను మైక్, స్టీఫన్ సాడా ప్రారంభించారు. పూర్తిస్థాయి సహజత్వాన్ని కోరుకునే వారు కట్టుబాట్లను పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా భోజనం చేసేందుకు ఈ హోటల్‌ను మొదలుపెట్టారు. అయితే అనుకున్నంతగా దీనికి ఆదరణ రాకపోవడంతో మూసివేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు