ఎన్టీఆర్‌, వైజ‌యంతి మూవీస్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Updated By ManamWed, 05/16/2018 - 15:51
ntr

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి విజ‌యంగా నిలిచిన చిత్రం 'స్టూడెంట్ నెం.1'. ఆ సినిమాని వైజ‌యంతి మూవీస్ సంస్థ‌కి అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా నిర్మించింది. ఆ త‌రువాత తార‌క్‌, వైజ‌యంతి మూవీస్ కాంబినేష‌న్‌లో 'కంత్రి', 'శ‌క్తి' చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. 'రాజా రాణి', 'పోలీస్‌', 'అదిరింది' వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన యువ ద‌ర్శ‌కుడు అట్లీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. 2019 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంది. వైజ‌యంతి మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆ చిత్రం తెర‌పైకి రానుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ పట్టాలెక్క‌నుంది. రామ్ చ‌ర‌ణ్ ఇందులో మ‌రో హీరోగా న‌టించ‌నున్నారు.

English Title
ntr, vyjayanthi movies combination film update..
Related News