ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

NTR

అమరావతి: సోమవారం నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష, ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే నగదు రహిత వైద్య సేవలు బంద్ అవ్వనున్నాయి. ఈ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల అసోషియేషన్(ఆశా) తెలిపింది. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఇప్పటి వరకు రోగులకు అందించిన చికిత్సకు సంబంధించి ప్రభుత్వం రూ.500 కోట్ల బకాయింపులు చెల్లించాల్సి ఉందని.. అది పూర్తయ్యేవరకు వైద్య సేవలను నిలిపివేస్తామని ఆశా వెల్లడించింది.

అయితే అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని ఆశా అధ్యక్షుడు డాక్టర్ వి. మురళీకృష్ణ పేర్కొన్నారు. మొత్తం 450 ఆసుపత్రులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. బకాయిలు చెల్లించాలని, లేకుంటే సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని.. అందుకే రేపటి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు