ఎన్.టి.పి.సికి దక్కిన సౌర విద్యుత్ టెండర్

ntpc

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వ్యతిరేక క్రమ వేలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుదుత్పాదన సంస్థ ఎన్.టి.పి.సి 85 మెగావాట్ల సౌర విద్యుత్ ఆర్డరు గెలుచుకుంది. ఉత్తర ప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజన్సీ గ్రిడ్ అనుసంధానిత సౌర ప్రాజెక్టులకు సంబంధించి 550 మెగావాట్ల టెండర్ల ప్రక్రియలో ఎన్.టి.పి.సి పాల్గొంది. డిసెంబర్ 3న నిర్వహించిన ఈ వేలంలో యూనిట్ ధరను ఎన్.టి.పి.సి రూ. 3.02 వద్ద కోట్ చేసింది. ఎన్.టి.పి.సి ఎగువ 85 మెగావాట్ల సౌర విద్యుదుత్పాదన ప్రాజెక్టులను నెలకొల్పవలసి ఉంటుంది. ఎన్.టి.పి.సి 25 ఏళ్ళపాటు ఆ విద్యుత్తును అందించవలసి ఉంటుంది. ఎన్.టి.పి.సి షేర్ విలువ బి.ఎస్.ఇలో రూ. 143.40 వద్ద కోట్ అవుతోంది.

Tags

సంబంధిత వార్తలు