ఇప్పుడు నిర్మాతగా కూడా..

Updated By ManamTue, 08/21/2018 - 01:20
parul

imageపారుల్ యాదవ్.. హీరోయిన్‌గా అలరించడమే కాదు.. నిర్మాతగా కూడా మెప్పించనున్నారు. వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో మనుకుమార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో కంగనా పోషించిన పాత్రను దక్షిణాదిన నలుగురు హీరోయిన్స్ చేస్తున్నారు.  తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో ‘దటీజ్ మహాలక్ష్మి’ .. తమిళంలో కాజల్ అగర్వాల్ ప్రధానంగా ‘పారిస్ పారిస్’..  కన్నడలో పారుల్ యాదవ్ బటర్‌ఫ్లై మలయాళంలో మంజిమ మోహన్ ‘జామ్ జామ్’ పేర్లతో తెరకెక్కిస్తున్నారు.

ఆసక్తికరైమెన విషయమేమంటే పారుల్ యాదవ్ కన్నడలో టైటిల్ పాత్రలో నటించడమే కాకుండా నాలుగు భాషల్లో సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ ‘‘సినిమాలో నటిస్తూ నిర్మించడమంటే చాలా కష్టమే. అయితే ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నాను. నాకు మంచి టీమ్ సపోర్ట్ దొరికింది’’ అన్నారు పారుల్. 

English Title
Now as a producer ..
Related News