చంద్రబాబుకు వారెంట్!

Updated By ManamThu, 09/13/2018 - 21:53
Non Bailable Warrant to AP CM Chandrababu Naidu
  •  బాబ్లీ కేసులో చంద్రబాబుకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్

Non Bailable Warrant to AP CM Chandrababu Naidu

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడుతో పాటు మరో 15మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతావారంతా కోర్టుకు హాజరు కావాలని మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతిల లేకుండా ప్రాజెక్ట్ వద్దకు వచ్చారని పోలీసులు కేసు నమోదు చేశారు.  అయితే ఎనిమిదేళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. 

కాగా తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా చంద్రబాబు ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న ముఖ్యమంత్రి న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై వారెంట్ జారీ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

English Title
Non-bailable warrant issued against chandrababu by Dharmabad Court
Related News