శ్రీదేవి లేని ఆ చిత్రం, తాజ్‌లేని ఆగ్రాతో సమానం

Updated By ManamThu, 05/17/2018 - 12:00
sridevi

mister india  శ్రీదేవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘మిస్టర్ ఇండియా’ ఒకటి. శేఖర్ కపూర్‌లో దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీయాలని శ్రీదేవి బతికి ఉన్నప్పుడు చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఇక ఇందులో నటించేందుకు శ్రీదేవి కూడా ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 

దీంతో వేరే హీరోయిన్‌ను పెట్టి  ఈ చిత్ర సీక్వెల్‌ను తీసే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటూ దర్శకుడు శేఖర్ కపూర్‌ను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శేఖర్ కపూర్, అది కాని పని అని తేల్చేశారు. శ్రీదేవి లేని మిస్టర్ ఇండియా, నర్గిస్ లేని మదర్ ఇండియా చిత్రాలు తాజ్‌మహల్ లేని ఆగ్రాతో సమానం అని పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర సీక్వెల్‌ను తీయాలన్న ఆలోచనను తాను, బోని కపూర్ విరమించుకున్నట్లు పేర్కొన్నారు. 

English Title
No sequel plans for Mister India: Director
Related News