'ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తుది గడువు లేదు'

Updated By ManamThu, 07/12/2018 - 20:17
special high court, Andhra pradesh, law ministry, supreme court (1356)

special high court, Andhra pradesh, law ministry, supreme court (1356)న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీంకోర్టులో కేంద్ర న్యాయ శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ఎలాంటి తుది గడువు లేదని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంచేసింది. హైకోర్టు ఏర్పాటుకు ఏపీలో అవసరమైన భవనాలు, మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తే హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇస్తామని అఫిడవిట్‌లో వెల్లడించింది. ఆర్థికపరమైన విషయాలను ఆర్థిక శాఖే చూసుకుంటుందని న్యాయ శాఖ పేర్కొంది.

English Title
No last date to form a special high court for Andhra pradesh, says law ministry
Related News