'జేడీ(ఎస్), కాంగ్రెస్‌కు పాలించే నైతిక హక్కు లేదు'

Updated By ManamTue, 05/15/2018 - 16:27
Karnataka assembly elections results, JD(S), Congress moral rights, Yeddyurappa

Karnataka assembly elections results, JD(S), Congress moral rights, Yeddyurappa బెంగళూరు: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీలకు లేదని యడ్యూరప్ప అన్నారు. ఒకే అతిపెద్ద పార్టీగా గవర్నర్ తొలుత బీజేపీనే ముందుగా పిలవాలని ఆయన చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడైన నేపథ్యంలో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల సందర్భంగా యడ్యూరప్ప మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక ప్రజల తీర్పునకు కృతజ్ఞతలు. రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీలకు లేదు. అతిపెద్ద పార్టీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రపాలనలో మార్పు కోసమే కన్నడ ప్రజలు తీర్పిచ్చారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రజల తీర్పును కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అడ్డదారిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రల్ని ఖండిస్తున్నాం. ఢిల్లీ పెద్దలతో చర్చించి నిర్ణయిస్తాం. ప్రజా వ్యతిరేకత వల్ల జేడీఎస్‌కు లాభం చేకూరింది’’ అని యడ్యూరప్ప పేర్కొన్నారు.

English Title
No JD(s), Congress Moral right to rule state, slams Yeddyurappa
Related News