నివారణ లేదు, నియంత్రణే!

Updated By ManamFri, 09/21/2018 - 00:56
No cure

imageఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగా మెదడుకు కొంతభారం తగ్గిందనుకొంటున్నారు కదా వాస్తవికంగా ఆలో చిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగి పోతుందేమోననే భయం వేస్తోంది. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని (మెద డు)  పనితనం పెరుగుతుంది. కాని ప్రస్తుత పరిస్థితు లు అందుకు భిన్నంగా తయారవుతు న్నాయి. మనిషి శరీరంలోని ఏదైనా అవయవం పని చేయకపోతే నొప్పి, బాధ అనిపిస్తుంది. వెంటనే ఆ అవయవం పూర్తిగా బాగయ్యేంత వరకు శ్రద్ధ వహిస్తున్న మనిషి, అదే ఉజ్వలమైన భవిష్య త్తును కళ్ల ముందుకు తీసుకువచ్చే ప్రధానమైన అవయవం మెదడును ఎలా వాడు కోవాలో తెలియకనో ఏమో మెదడు పనితీరుపై శ్రద్ద చూపడం లేదు.

నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్ వ్యా దికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆస క్తిలేకపోయినా తాత్కాలికంగా మతి మరుపు రా వచ్చు. అల్జీమర్స్‌తో మనిషి జ్ఞాపకాలు మా యం, మెదడు పనితీరును క్రమేపి దారుణంగా దెబ్బతీస్తుంది.

నోటికి చేయాల్సిన చిన్నచిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తూ తన మె దడు మొద్దుబారే విధంగాimage తయారు చేసు కుం టున్నాడు. ఎందుకిలా జరుగుతోంది. మారుతు న్న కాలానికి అనుగుణంగా జీవితాలు, జీవన విధానాలలో మార్పులు, చేర్పులు  చోటుచేసు కుంటున్నాయి. ప్రపంచాన్ని అరచేతి (మొబైల్ ఫోన్)లోనే వీక్షిస్తున్న మనిషికి అప్పుడప్పుడు వి చిత్రమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సమ యానికి గుర్తుకురాని యూజర్ ఐడీలు, పాస్ వర్డ్‌లు, సీక్రేట్ కోడ్‌లతో మతిమరుపు వచ్చిందే మోనని అనుమానాన్ని కూడా మెదడు గుర్తు చేస్తుంది.
ఏ మెదడును చలాకీలా పనిచేయించు కోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇవి జ్ఞాప కశక్తి మెరుగు పరచుకోవడానికి దోహదం చేస్తా యి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహా రం, శారీరక, మానసిక వ్యాయామాలు ఎంతో దోహదం చేస్తాయి.

డిమెన్షియా, అల్జీమర్స్‌లు సరిగ్గా ఈ జ్ఞాప కాలను మాయం చేస్తాయి. మన ఆలోచన, ప్ర వర్తనలనూ దెబ్బతీస్తాయి. రోజువారీ పనుల పై తీవ్ర ప్రభావం చూపుతాయి. డిమెన్షియా ర కాల్లో తరచుగా కనబడేది అల్జీమర్సే. అల్జీమర్స్ సాధారణంగా 65 ఏళ్ల తర్వాత వస్తుందంటారు.  చిన్నవయసులోనూ రాకూడదని ఏమి లేదు.

2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్ర కారం మనదేశంలో 41 లక్షల మంది అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డిమోన్షియాతో బాధపడే వారిలో 50 శాతం ఆసియాలోనే ఉంటారని హెచ్చ రిస్తున్నా రు. కాబట్టి  వీలైనవంతవరకు మెదడుకు పని చెప్పడం ఉత్తమం. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకురాక వేదనకు గుర య్యే వారెందరో, వాస్తవానికి గత దశాబ్దకాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తిస్థాయి లో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధారప డుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేశాం. దీనివల్ల మరుపు మితిమీరడం వల్ల జీవితాలు బుగ్గిపాలు అవుతున్న సంఘటనలు కోకొల్లలు. బతుకు భారంగా నెట్టుకొస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అల్జీమర్స్ వ్యాధి మూలంగా మెదడులోని జీవకణాలు ఏకకాలంలో మృతక ణాలుగా తయారుకావడంతో అనేక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివి పెరిగి పెరి గి అల్జీమర్స్ తీవ్రతకు దారితీస్తాయి. అల్జీమర్స్ వ్యాధికి గురైతే పూర్తిగా నివారణ వీలు కాదు, ఒత్తిడికి దూరంగా ఉండడం వల్ల నియంత్రణ చేయవచ్చు. అల్జీమర్స్‌ను ప్రారంభంలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యపడుతుంది.

రోజూ చేసే పను లను కుటుంబ సభ్యులు గుర్తుచేస్తుండాలి. జ్ఞాప కశక్తి లేదని అవహేళన చేయకూడదు. ఒంటరిగా ఉండకుండా టీవీ, పత్రికలు, పుస్తకాలు, మ్యాగ జైన్లు ఏర్పాటు చేయాలి. మానసికంగా  ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మెదడులో సమాచార ప్రసారం ఒకనాడీ కణం నుంచి మరో నాడీకణానికి ప్రసరిస్తూ ఉంటుం ది. కొత్త విషయాలతో నాడి కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇలాంటి కొత్త బంధా లు మెదడును చురుకుగా తయారుచేస్తుంది. మనకు మనమే ఏదో ఒక పనిని కల్పించుకొని దానిలో నిమగ్నం కావడం, కొత్త వ్యక్తులను కల వడం, పరిచయాలు, ఆలోచనా విధానాలలో మార్పు చేసుకోవడం, సాధారణంగా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి వారినే కలుస్తూ ఉం టాం మంచిదే కాని ఇతర వృత్తుల వారినీ కలి స్తే వైవిధ్య భరిత ఆలోచనలు వస్తాయి, కొత్త వి షయాలు తెలుస్తాయి. రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరో గ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలుచేస్తుంది. రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోవ డం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదిరి మెదడు చురుకుగా పనిచేస్తుంది.

మెదడు క్షీణతను తగ్గించడానికి, విటమిన్ బి6, బి 12, ఫోలిక్ ఆమ్లం, కలిగిన ఆకుకూ రలు, చికెన్ , గుడ్లు వంటి వాటిలో ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, బత్తాయి, విటమిన్ ఇ, (విషయ గ్రహణ శక్తి) దంపుడు బియ్యం, విటమిన్ కె అధికంగా ఉండే అరటి, గోబి పువ్వు లాంటివి తీసుకోవాలి. మెదడుకు నిరంతరం శక్తి అందితేనే ఏకాగ్రత కుదురు తుంది, పొట్టు తీయని ధాన్యాలు తింటే నిదా నంగా జీర్ణమవుతూ రక్తంలోకి నెమ్మదిగా గ్లూకో జు విడుదలవుతూ మెదడుకు నిరంతరం శక్తి అందుతుంది. కాబట్టి దంపుడు బియ్యం, రాగు లు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి.

- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
 కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, 9703935321
(నేడు అల్జీమర్స్ డే)

English Title
No cure, control!
Related News