వాట్సాప్‌లో వారిపై కామెంట్లు చేశారంటే?

Updated By ManamFri, 09/14/2018 - 18:39
No comment, Shares on Watsapp, AP, Telangana DGPs
  • ఏపీ, తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి హెచ్చరిక.. 

  • పూర్తిగా వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌దే బాధ్యత.. 

  • సభ్యులపై కేసు నమోదు చేసి పత్రికల్లో ప్రచురిస్తాం

No comment, Shares on Watsapp, AP, Telangana DGPsహైదరాబాద్/అమరావతి: ప్రముఖ సోషల్ మీడియా మెసేంజర్ వాట్సాప్‌లో అసభ్యకర వార్తలు షేర్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు శుక్రవారం ఏపీ, తెలంగాణ డీజీపీలు హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ, లేదా ఏ నేత‌ను ఉద్దేశించి అసభ్యకరంగా సోషల్ మీడియాలో వాట్సప్ ద్వారా పోస్ట్ చేస్తే తీవ్ర పరిమాణాలుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయడంగానీ, పోస్టు చేయడంగానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ముందుగా వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ ఈ చర్యకు పూర్తి బాధ్యుడివుతాడని స్పష్టం చేశారు.

గ్రూపు అడ్మిన్‌పై చర్యలకు తీసుకోవడమే కాకుండా పోస్టు చేసిన గ్రూపు సభ్యులపై కేసు నమోదు చేసి వారి వివరాలను పత్రికలలో ప్రచురిస్తామని తెలుగు రాష్ట్రాల డీజీపీలు వెల్లడించారు. చివరిగా గమనిక తెలియజేస్తూ.. వాట్సాప్ గ్రూపు సభ్యులందరూ దయచేసి ఇతరులకు మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసే సమయంలో ఒక్కసారిగా నిశితంగా పరిశీలించుకోవాల్సిందిగా జాగ్రత్తలు సూచించారు. 

English Title
No comment and Shares on Watsapp to that political party leaders, says AP, Telangana DGPs
Related News