నిత్యా మీనన్  ‘ప్రాణ’ ఫస్ట్ లుక్

Updated By ManamSun, 06/24/2018 - 06:00
nithya menon
image

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ప్రయోగాత్మక చిత్రం ‘అ!’లో లెస్బియన్ పాత్రలో కనిపించి అలరించిన కేరళకుట్టి నిత్యా మీనన్.. అతి త్వరలో ‘ప్రాణ’తో సందడి చేయనున్నారు. ఈ సినిమాలో నిత్యా తప్ప మరో ఆర్టిస్ట్ కనిపించరు. ‘కావ్యాస్ డైరీ’ దర్శకుడు వి.కె.ప్రకాష్ రూపొందించిన ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రహకుడు పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు. ఆస్కార్ అవార్డు విజేత సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి ఈ చిత్రం కోసం సరౌండ్ సింక్ సౌండ్ ఫార్మెట్ అనే కొత్త తరహా సౌండ్ క్వాలిటీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో.. చుట్టూ బొమ్మల తలలు ఉంచి మధ్యలో నిత్యా మీనన్ ముఖాన్ని చూపించారు. దీన్ని బట్టి.. ఈ సినిమా ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని చెప్పొచ్చు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

English Title
Nithya Menon's 'Prana' first look
Related News