హిట్ డైరక్టర్‌తో నితిన్..?

Updated By ManamFri, 11/02/2018 - 12:49
Nithiin

Nithiinవరుస పరాజయాలతో మళ్లీ ఢీలా పడ్డ నితిన్.. కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటిస్తున్న నితిన్.. తాజాగా మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

‘కరెంట్’, ‘కుమారి 21f’ చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్న సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2న సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
Nithiin next with Kumari 21f director
Related News