వైవిధ్య దర్శకుడితో నితిన్..?

Updated By ManamSat, 06/02/2018 - 13:30
nithin

Chandra Sekhar Yeleti ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలతో మళ్లీ పరాజయాల బాట పట్టిన నితిన్, ప్రస్తుతం సతీశ్ వేగెష్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’లో నటిస్తున్నాడు. కాగా తాజాగా నితిన్ వైవిధ్య దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రయాణం, సాహసం, మనమంతా వంటి వైవిధ్య చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ ఏలేటికి నితిన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌లో నితిన్ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


 
 

English Title
Nithiin green signal to Chandra Sekhar Yeleti
Related News