నిర్వాణ సినిమాస్ చిత్రం ప్రారంభం

Updated By ManamSun, 06/24/2018 - 06:55
NIHARIKA-MOVIE

NIHARIKA-MOVIEరాహుల్ విజయ్, నిహారిక కొణిదెల హీరో హీరోయిన్లుగా నిర్వాణ సినిమా బ్యానర్‌పై కొత్త చిత్రం శనివారం ప్రారంభమైంది. ప్రణీత్ బ్రమనడపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్మారెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేశ్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి కె.నాగబాబు క్లాప్ కొట్టగా.. హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు.  అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘‘ముద్దపప్పు అవకాయ’, ‘నాన్నకూచి’ తర్వాత నన్ను, నా స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్వాణ సినిమాస్, నిహారిక, రాహుల్ విజయ్‌గారికి చాలా థాంక్స్. ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 25 నుండి జూలై 20 వరకు జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ ఆగస్టులో ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా నిర్వాణ సినిమాస్‌పై యు.ఎస్‌లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం’’ అన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘‘శేఖర్ కమ్ములగారి సినిమాలా ఉంటుందని నమ్ముతున్నాను. మంచి టీం కుదిరింది. శివాజీరాజాగారు మంచి పాత్ర చేస్తున్నారు. అలాగే నిహారికగారి పక్కన నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను’’ అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘నిర్వాణ సినిమాస్ తొలి ప్రొడక్షన్ ఇది. డైరెక్టర్ ప్రణీత్ నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తన ఫస్ట్ మూవీలో నేను చేయడం ఆనందంగా ఉంది. రాహుల్ ఇందులోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడు. సినిమా కొత్తగా ఉండి.. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. 

English Title
Nirvana Cinemas Movie Launch
Related News