బ్రిటన్ నుంచి జంప్

Updated By ManamThu, 06/14/2018 - 10:30
Nirav

nirav లండన్: భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకున్న నీరవ్ మోదీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా జంప్ అయ్యాడు. బ్రిటన్ నుంచి మంగళవారం, బుధవారం ఈ రెండు రోజుల్లోనే బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. అయితే లండన్ పౌరసత్వం కోసం నీరవ్ ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆ దేశం నుంచి పారిపోవడం విశేషం. కాగా నీరవ్ మోదీ పరారీపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి భారత దౌత్య కార్యాలయానికి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

అయితే భారత్‌లో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డ నీరవ్ మోదీ ఇక్కడ నుంచి బ్రిటన్‌కు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి రప్పించేందుకు భారత్ చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా సీబీఐ ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించింది. మరోవైపు మంగళవారం ముంబైలోని స్పెషల్ కోర్టు నీరవ్ మోదీ, అతడి కుటుంబసభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇది ఇలా జరుగుతుండగానే బ్రిటన్ నుంచి కూడా నీరవ్ మోదీ పారిపోయాడు. ఈ క్రమంలో సింగపూర్ పాస్‌పోర్ట్‌తో మోదీ బ్రిటన్ విడిచి వెళ్లినట్లు సమాచారం.

English Title
Nirav modi flees to Brussels
Related News