మెగా హీరో సరసన ‘సవ్యసాచి’ భామ..?

Updated By ManamMon, 11/05/2018 - 10:52
Nidhhi Agewal

Nidhhi Agewal‘సవ్యసాచి’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన నిధి అగర్వాల్ ప్రస్తుతం అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తోంది. అయితే తొలి చిత్రం కాస్త నిరాశపరిచినా.. ఈ అమ్మడు ఇప్పుడు మరో ఆఫర్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Nidhhi Agerwal got another offer..?
Related News