న్యూజిలాండ్, స్పెయిన్ మ్యాచ్ డ్రా

hocky
  • పురుషుల హాకీ వరల్డ్‌కప్

భువనేశ్వర్: పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్, స్పెయిన్ జట్ల మధ్య పూల్-ఏలో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదోవ ర్యాంక్‌లో కొనసాగుతున్న స్పెయిన్ జట్టు ఆరంభంలో అదరగొట్టినా... చివరి అర్ధ భాగంలో తడబడింది. స్పెయిన్ జట్టు తొలి రెండు క్వార్టర్స్‌లో గోల్స్ నమోదు చేసింది. మ్యాచ్ 9వ నిమిషంలో అల్బెర్ట్ బెల్ట్న్ గోల్ చేసి స్పెయిన్‌కు తొలి గోల్‌ని అందించి ఆధిక్యంలో ఉంచగా... రెండో క్వార్టర్‌లో అల్‌వారో (27వ నిమిషం)లో గోల్ చేసి 2-0తో ముందంజలో నిలిపాడు. దీంతో స్పెయిన్ అర్ధ భాగం ముగిసేసరికి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ చివరి 10 నిమిషాల్లో న్యూజిలాండ్ అనుకోని రితీలో రెండు గోల్స్ నమో దు చే సింది. న్యూజిలాండ్ లో ఫిలిప్స్ (50వ నిమిషం), రస్సెల్ (56వ నిమిషం)లో గోల్స్ చేయడంతో మ్యాచ్ 2-2తో స మంగా నిలిచి డ్రాగా ముగిసింది.

హాకీ వరల్డ్‌కప్‌లో నేడు
ఆస్ట్రేలియా X చైనా (సా. 5 గం.)
ఐర్లాండ్ X ఇంగ్లాండ్ (రా. 7 గం.)
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం

Tags

సంబంధిత వార్తలు