సీఎం కేసీఆర్‌కు కొత్త వాహన శ్రేణి

kcr

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు కొత్త వాహన శ్రేణిని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం సిద్ధం చేస్తోంది. 2014 లో టయోటా వాహనాలను సీఎం కు సమకూర్చిన పోలీసు విభాగం, ఈ సారి కూడా అవే వాహనాలను సమకూర్చను న్నారు. మెర్సిడెజ్ బెంజ్, ఇతర ఖరీదైన వాహనాలను సమకూర్చా లని నిర్ణయించినా, సీఎం వాటిని కాదనడంతో టయోటా వాహనాలనే ఖరారు చేశారు. కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా కొత్త కార్లను కొను గోలు చేయాలని నిర్ణయించారు. కొత్త వాహన శ్రేణిలో టయోటా ల్యాండ్ క్రూజర్, ఫార్చూనర్ , ప్రాడోస్ రకాలను ఖరీదు చేయనున్నారు. ప్రాడో కారు ధర రూ.93 లక్షలు, ఫార్చూనర్ కారు రూ.33 లక్షలుండగా పన్నులు, ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. కార్లను ఖరీదు చేసి న తరువాత బుల్లెట్ ఫ్రూప్ చేయించాల్సి ఉంటుంది. సీఎం వాహన శ్రేణిలో లో ఏడు నుంచి పది కొత్త వాహనాలు ఉండనున్నా యి. కేసీఆర్ కోసం ప్రాడో వాహనాన్ని ఎంపిక చేశారు. ఈ వాహనాన్ని  గజ్వేల్ నుంచి హైదరాబాద్ రాకపోకలు సాగించేం దుకు ఎక్కువగా వినియోగించనున్నారు
 

Tags

సంబంధిత వార్తలు