ఇలా చేస్తే.. వీసా రాదు!

Updated By ManamFri, 09/14/2018 - 16:03
US visa, Indian passport holders, H1B visa holders, tourist visa
  • అమెరికా వీసాకు కొత్త నిబంధనలు.. తప్పులు రాస్తే భారతీయలకు నో

  • డాక్యుమెంటుల లేకపోయినా అంతే.. హెచ్1బి సహా అందరికీ రూల్ వర్తింపు

US visa, Indian passport holders, H1B visa holders, tourist visa వాషింగ్టన్: భారతీయ పాస్‌పోర్టు ఉన్న పౌరులు ఇక మీదట అమెరికా వెళ్లేటపుడు వీసా దరఖాస్తులో ఏమైనా తప్పులు రాసినా, జతపరచాల్సిన పత్రాలు జతపరచకపోయినా వారి వీసా దరఖాస్తును అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వర్గాలు తిరస్కరిస్తాయి. ఇందుకు వీలు కల్పించేలా కొత్త వీసా నిబంధనలను అమెరికా తాజాగా జారీచేసింది. ఈ నిబంధనలు 12వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. దరఖాస్తులో పొరపాటున తప్పు రాశానని గానీ, ఫలానా డాక్యుమెంటు మర్చిపోయానని గానీ వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఉండదు.

ఈ నిబంధనలు హెచ్1బి సహా చాలా రకాల వీసా దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. ముఖ్యంగా గ్రీన్‌కార్డు పొంది అమెరికాలో పౌరసత్వహోదా పొందాలనుకునేవారు, ఇమ్మిగ్రెంట్లు, నాన్ ఇమ్మిగ్రెంట్లు, తాత్కాలికంగా అమెరికాలో ఉండి ఉద్యోగం చేయాలనుకునేవారు, అమెరికా పౌరసత్వం కావాలనుకునేవారికి ఈ నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయి. ఒక్క టూరిస్టు వీసా లేదా బిజినెస్ వీసా మీద వెళ్లాలనుకునే వారికి మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. 

ఇప్పటికే అత్యంత సంక్లిష్టంగా ఉన్న అమెరికా వీసా నిబంధనలు ఇపుడు మరింత సంక్లిష్టంగా, మరింత ఖరీదుగా మారడానికి ఈ కొత్త నిబంధనలు కారణం అవుతాయని అంటున్నారు. కచ్చితమైన డాక్యుమెంట్లు అందించకపోవడం, లేదా దరఖాస్తులో తప్పులు రాయడం వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్నవారిని భారతదేశానికి తిరిగి పంపేసే అవకాశం కూడా ఉంటుంది. అమెరికాలో హెచ్1బి వీసా ఉన్నవాళ్లకు ఈ నిబంధన మార్పు వల్ల ప్రభావం పడుతుంది. ప్రతియేటా 9,800 మంది భారతీయులు గ్రీన్‌కార్డులు పొంది అమెరికాలో పౌరసత్వ హోదా పొందుతుంటారు. 

English Title
New US visa rule says Indian passport holders can be rejected for errors
Related News