వాట్సాప్‌లో సరికొత్త ఎమోజీ.. ఏంటిది..?

Updated By ManamFri, 06/22/2018 - 16:07
New Emoji Stickers In Whatsapp
New Emoji Stickers In Whatsapp

వాట్సాప్ వాడుతున్నవారికి ఎమోజీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన భావోద్వేగాలను ఓ చిన్న బొమ్మ ద్వారా చెప్పే ప్రయత్నమే ఆ ఎమోజీ. ఇప్పుడు ఎమోజీలతో పాటు కొత్తగా భావోద్వేగాలను చెప్పించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఉన్న ‘స్టిక్కర్స్’ను వాట్సాప్‌లోనూ పెట్టాలని నిర్ణయించింది సంస్థ. అందుకు అనుగుణంగా తొలి విడతలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ వారంలోనే అది ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్లలో పెట్టినా.. ప్రస్తుతానికి డిసేబుల్ చేసింది. వారంలో ఎలాగూ ఆండ్రాయిడ్ యూజర్లకు దానిని అందుబాటులోకి తెస్తున్నారు కాబట్టి.. బీటా వెర్షన్‌లోనూ అప్పుడే ఎనేబుల్ చేస్తామని చెబుతున్నారు. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో ఈ స్టిక్కర్లకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఉంచింది. వివిధ రకాల భావోద్వేగాలతో ఈ స్టిక్కర్ ఎమోజీలను క్రియేట్ చేసింది. లోల్, లవ్, సాడ్, వావ్ వంటి నాలుగు రకాల రియాక్షన్లను ఈ ఎమోజీల ద్వారా చెప్పేందుకు వీలు కల్పిస్తోంది. అవేకాకుండా మరిన్ని ఎమోజీలనూ డౌన్‌‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

New Emoji Stickers In Whatsapp

 

English Title
New Emoji Stickers In Whatsapp
Related News