మూడు బ్యాంకులకు కొత్త చైర్‌పర్సన్‌లు

Updated By ManamFri, 05/25/2018 - 22:20
 three banks

 three banksన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను సంస్కరించే ఎజెండాలో భాగంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, దేనా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక మంత్రిత్వ శాఖ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌లను నియమించింది. పెరిగిపోతున్న మొండి బాకీలు, భారీ నష్టాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి.  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న 2 బిలియన్ అవెురికన్ డాలర్ల మోసంతోసహా, బ్యాంకుల్లో వివిధ కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయి. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా, బ్యాంక్స్ బోర్డ బ్యూరో సిఫార్సు మేరకు ప్రభుత్వం చరణ్ సింగ్, అంజలి బన్సల్, తపన్  రేలను వరుసగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, దేనా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌లుగా నియమించినట్లు ఫైనాన్షియల్ సర్వీసుల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఒక ట్వీట్‌లో తెలిపారు. ఐ.ఎం.ఎఫ్‌లో సీనియర్ ఆర్థికవేత్తగా పనిచేసిన చరణ్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. స్పెన్సర్ స్టూవర్ట్స్ ఇండియా స్థాపకురాలైన అంజలి బన్సల్ కొంతకాలం మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేశారు. ఇక తపన్ రే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అలహాబాద్ బ్యాంక్‌తో సహా మరికొన్ని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  ఉన్నత స్థాయిలో త్వరలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలిసింది. అలహాబాద్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఓ ఉషా అనంతసుబ్రమణియన్ కార్యనిర్వాహక అధికారాలన్నింటినీ ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. పి.ఎన్.బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐ.డి.బి.ఐ బ్యాంక్‌ల టాప్ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం గత ఏడాది మే నెలలో మార్పు చేర్పులు చేసింది. అనంతరం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 2.11 లక్షల కోట్ల మేర మూలధనాన్ని తిరిగి చొప్పించనున్నట్లు ప్రకటించింది. మొండి బాకీల ఫలితంగా ఎస్.బి.ఐ 2017- 18 సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి రూ. 7,718 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అదే త్రైమాసికానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 13,417 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

English Title
New Chairperson for three banks
Related News