నెట్ న్యూట్రాలిటీకే సై!

Updated By ManamWed, 07/11/2018 - 23:34
net-nuetrality
  •  ట్రాయ్ సిఫారసులకు ఆమోదం .కొన్నింటికి మినహాయింపులు.. 

  • ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు.. అందరికీ సమానంగా నెట్: కేంద్రం

net-nuetralityన్యూఢిల్లీ: ఇంటర్నెట్ సమానత్వనికే (నెట్ న్యూట్రాలిటీ) కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు ట్రాయ్ ప్రతిపాదించిన సిఫారసులను ఆమోదించింది.  ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. నెట్ న్యూట్రాలిటీకే కేంద్రం అంగీకరించినందున.. ఇకపై టెలికం కంపెనీలు ఇంటర్నెట్ వాడకందార్లందరికీ ఒకేరకమైన వేగం(స్పీడ్), డౌన్‌లోడింగ్ సామర్థ్యంతో సేవలందించాల్సి ఉంటుంది.

కొందరికి వేగంగా, మరికొందరికి మందకొడిగా.. కొందరికి అపరిమితంగా, మరి కొందరికి పరిమితంగా, ఒకే వెబ్‌సైట్లో కొన్ని అంశాలు తొందరగా, మరికొన్ని ఆలస్యంగా తెరుచుకోవడం లాంటివి ఇకపై ఉండదు. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలకు, మొబైల్ కంపెనీలకు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారీగా జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే.. ఇందుకు విరుద్ధంగా ఏవైనా కంపెనీలు లేదా సంస్థలు ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట సేవలు అందించడంలో ఒకరికి  ఒకరికి ఎక్కువ, వేరొకరికి తక్కువ ప్రాధాన్యం లభించేలా చేయకూడదు. అయితే కొన్ని అటానమస్ సంస్థలు, టెలీమెడిసిన్ వంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ సంస్థల అవసరాల నేపథ్యంలో సాధారణం కన్నా వాటికి ఎక్కువ వేగంతో సేవలు అందించొచ్చు. బుధవారం జరిగిన టెలికం కమిషన్ సమావేశంలో ‘నెట్ న్యూట్రాలిటీ’కి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వెల్లడించారు. 

English Title
Net Neutrality Sigh!
Related News