77 శాతం మంది పీల్చేది కలుషిత గాలే

Nearly 10 Lakh People Died Due To Air Pollution In India In 2017
  • వాయు కాలుష్యంతో దేశంలో మరణాలివీ

  • 2017 సంవత్సరంలో భారీగా మృతులు

  • ప్రభుత్వ ఆదేశంతో అతి పెద్ద పరిశీలన

  • ఐసీఎంఆర్.. మరో మూడు సంస్థలు

  • కాలుష్యంతో 1.7 ఏళ్లు తగ్గిన ఆయుష్షు

  • 77 శాతం మంది పీల్చేది కలుషిత గాలే

న్యూఢిల్లీ, డిసెంబరు 7: వాయు కాలుష్యమా... దానిదేముందిలే అని వదిలేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే, గత సంవత్సరం భారతదేశంలో మొత్తం కోటి వరకు మరణాలు సంభవిస్తే, అందులో 12.4 లక్షల మరణాలు కేవలం వాయు కాలుష్యం వల్లేనని శాస్త్రీయ పరిశీలనలలో తేలింది! అంటే ప్రతి ఎనిమిది మరణాలలో ఒకటి కేవలం విషపూరిత గాలుల వల్లనే అని కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో నిర్వహించిన అతి పెద్ద పరిశోధనలో లెక్కతేలింది. 100కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలు, ఇంకా లెక్కలేనంత మంది ఇతర సిబ్బంది కలిసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో, వాయు కాలుష్యం కారణంగా భారతీయుల ఆయుఃప్రమాణం 1.7 సంవత్సరాలు పడిపోయిందని కూడా చెప్పారు. అంతేకాదు.. భారతీయులలో 77 శాతం మంది బాగా విషపూరిత గాలినే పీలుస్తున్నారట.

ఒక్క సంవత్సరంలోనే 12,40,000 మంది వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్నారంటే అది ప్రజారోగ్యానికి సంబంధించి అతిపెద్ద ఆందోళనకరైమెన అంశం. ఇంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరికొన్ని అవెురికా యూనివర్సిటీలు కూడా భారతదేశంలో వాయుకాలుష్యం ప్రభావాన్ని అంచనా వేయుడానికి కొన్ని పరిశీలనలను చేశాయి గానీ, అవి కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అయ్యాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన లలితన్ దండోనా తెలిపారు. ఆమె ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. కనీసం ఈ లెక్కలు చూసిన తర్వాత అయినా దేశంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు మొదలవ్వాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ద లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రికలో ప్రచురితమైన ఈ సర్వే వివరాలను ఢిల్లీలో విడుదల చేశారు. భారతీయులలో దాదాపు మూడింట రెండొంతుల మంది పీఎం 2.5ను క్యూబిక్‌మీటరుకు 89.9 యూజీ చొప్పున పీల్చుకుంటున్నారని, కానీ వాస్తవానికి దాని పరిమితి కేవలం 40 యూజీ మాత్రవేునని ఆమె అన్నారు. జాతీయ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన దానికంటే పీఎం2.5 చాలా ఎక్కువగా ఉంటోంది. ఇది అత్యంత సూక్ష్మ కాలుష్యం కావడంతో సులభంగా ఊపిరితిత్తుల వరకు వెళ్లిపోతుంది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, బిహార్, హరియాణా లాంటి ప్రాంతాలలో ఈ పీఎం2.5 కాలుష్య తీవ్రత అధికంగా ఉండగా.. అత్యంత తక్కువగా కేరళలో ఉంటోంది. మిగిలిన రాష్ట్రాలు కూడా కేరళను ఆదర్శంగా తీసుకుని కాలుష్యాన్ని నియంత్రించాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు