కమల్‌తో పోటీ పడుతున్న నయనతార

Updated By ManamFri, 07/13/2018 - 10:29
Kamal, nayan

nayan, kamal తమిళనాట టాప్ హీరోలకు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంది నయనతార. ఆమెకు ఉన్న సక్సెస్ ఇమేజ్‌తో ఇప్పుడు లోకనాయకుడినే ఢీకొట్టబోతోంది. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన ఆగష్టు 10వ తేదికి వాయిదా వేశారు. అయితే అదే రోజు కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో మొదటిసారిగా కమల్‌తో పోటీ పడనుంది నయనతార. కాగా ఇప్పటికే టీజర్లతో ఆకట్టుకున్న ఈ రెండు చిత్రాలపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలంటే ఆగష్టు 10వరకు వేచి ఉండాల్సిందే.

English Title
Nayanthara competate with Kamal Haasan
Related News