‘నయా’ ఆర్థిక విధానం రైతుకు చేటు

Updated By ManamFri, 10/05/2018 - 01:28
formers protest

image‘మహాత్మా గాంధీ ఒకసారి బెంగళూరులోని నేషనల్ డె యిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను సందర్శించారు. ఆ సం దర్భంగా విజిటర్స్ బుక్‌లో  తన పేరు ఎదురుగా ఉన్న వృత్తి కాలమ్‌లో రైతు అని ఆయన రాశా’రని ఢిల్లీలో రైతులపై పోలీసు చర్య అనంతరం ప్రొఫెసర్ స్వామినాథన్ ట్వీట్ చేశారు. మహాత్ముడి 150వ జయంతిని మంగళవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. అదేరోజు దేశరాజధాని ఢిల్లీలో అన్నదాతలపై వాటర్ క్యానన్స్, టియుర్ గ్యాస్ షెల్స్‌తో రైతుబిడ్డనని చెప్పుకునే జాతిపిత జయంతికి స్వాగతం పలికాం. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగానే అహింసాయుత పద్ధతుల్లో ఆందోళనకు దిగారు. మన ప్రభుత్వం మా త్రం బ్రిటిష్ పాలకుల్ని గుర్తుకు తెచ్చింది. హరిద్వార్ నుంచి న్యూఢిల్లీ వరకు పదిరోజుల పాటు నిర్వహిం చిన ఈ రైతు ఆందోళన కార్యక్రమం ఎక్కడా శాంతిభద్రతల పరిస్థితిని కల్పించలేదు. ఆసాంతం ప్రశాంతం గానే జరిగింది. అలా జరగడం వల్ల రైతుల ఒత్తిడికి లొంగిపోయామనే భావన కలగకుండా పోలీసులతో కేంద్రప్రభుత్వమే స్వయంగా శాంతిభద్రతల సవుస్య  సృష్టించింది. తద్వారా రైతులను దోషులుగా చూపిం చేందుకు చేసిన కుట్ర బెడిసికొట్టింది. 

అదేరోజు హర్యానాలో పోలీసు కస్టడీలో రణబీర్‌సింగ్ అనే 65 ఏళ్ల వృద్ధైరెతు మరణించాడు. బ్యాంక్ రుణం చెల్లించేందుకు ఆయనిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పదిరోజుల క్రితమే రణబీర్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన 9.83 లక్షల రూపాయల రుణం చెల్లించవలసి ఉన్నది. బ్యాంక్‌కు ఇచ్చిన చెక్ చెల్లకపోయిన కేసులో ఆయునకు రెండేళ్ల జైలు శిక్ష న్యాయుస్థానం విధించింది. మరణానికి ముందు రెండురోజుల క్రితం ఆయన్ని కలిసిన బంధువులను కలుసుకున్న తరువాత షాక్‌తో మరణించాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయన వేసిన పంటమొత్తం నష్టపోవా ల్సి వచ్చింది. బ్యాంకులకు రుణం చెల్లించని కారణం గా రణబీర్‌సింగ్ ఒక్కరికే శిక్షపడలేదు. పంజాబ్, హ ర్యానాల్లో బ్యాంకు రుణాలు చెల్లించలేదనే కారణంతో వందలాది రైతులు జైలుశిక్షలు అనుభవిస్తున్నారు. 

ఇదే సవుయంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లో 169 గ్రూప్ కంపెనీలున్నాయి. ఈ గ్రూప్ కంపెనీలన్నీ కలిసి 90 వేల కోట్ల రూపాయల మేరకు రుణం చెల్లించాల్సి ఉం ది. ఈ వసూలు కాని రుణాలకు బాధ్యులుగా ఉన్నత స్థాయి పాలకవర్గానికి చెందిన ఏ ఒక్క అధికారినీ ఇంతవరకు అరెస్టు చేయులేదు. ఈ రెండు ఘటనలు (ఢిల్లీలో పోలీసుల దాడి, హర్యానాలో రైతు మరణం) రైతుగా తనను తాను చెప్పుకునే మహాత్మాగాంధీ జ యంతి రోజునే జరగడం విశేషం కాగా జరుగుతున్న పరిణామాలు వ్యవసాయంలో అన్యాయానికి సంకేతం గా నిలుస్తున్నాయి. గత ఎన్నో దశాబ్దాలుగా రైతులు తమ డిమాండ్ల సాధనలో విఫలవువుతూనే ఉన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పెల్లుబుకుతున్న అసం తృప్తి గత కొంతకాలంగా వెల్లువెత్తుతూనే ఉన్నారు. 

గత ఆరునెలల కాలంలో దేశవ్యాప్తంగా నాశిక్ నుంచి ముంబై వరకు రైతుల పాదయాత్ర ఎంతో ప్ర శాంతంగా జరిగింది. దాన్ని కొనసాగింపుగా నగరాలు, పట్టణాల్లో పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయల సరఫరా నిలిపివేస్తూ పదిరోజుల పాటు రైతులు బంద్ పాటించారు. ఈ ఆందోళనా కార్యక్రమాలన్నింటినీ సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరితో మరొకరు పం చుకుంటూ తమ ఆందోళనకు పెద్దయెుత్తున ప్రచారం నిర్వహించిన విషయం విదితమే. ప్రభుత్వాల్లో మా త్రం ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో హరిద్వార్ నుంచి న్యూఢిల్లీ వరకు పదిరోజుల పాటు నిర్వహించారు. వీటికి తోడు దేశంలో వివిధ ప్రాంతాల్లో రైతులు వివిధ రకాల నిరసనలు జరిపారు. 

ఈ ప్రదర్శనలకు తోడు మరికొన్ని నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భూమిలేని ఆదివాసీలు కొద్దిరోజుల క్రితం గ్వాలియర్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. దీంతో వ్యవసాయురంగంలో తీ వ్రంగా పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు బయుల్పడుతున్నాయి. జాతీయ నేర రికార్డ్సు బ్యూరో (ూ్చ్టజీౌ్చజూ ఇటజీఝ్ఛ ఖ్ఛఛిౌటఛీట ఆఠట్ఛ్చఠ) ప్రకారం, 2014లో 687 నిరసన ప్రదర్శనలు జరగ్గా, 2015లో ఇవి నాలుగురెట్లకు (2,683 ప్రదర్శనలు) పెరిగాయి. ఆ తరువాతి ఏడాది ఇది రెట్టింపు 4,837గా నమోదయ్యాయి. అంటే మూడేళ్లలో నిరసన ప్రదర్శనలు ఆరు రెట్లు పెరగడం రైతుల్లో ప్రభుత్వాల విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంచేస్తోంది. ఇందుకు కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ వ్యవసాయురంగంలో పెరిగిపోతున్న అసంతృప్తి కి, ఆవేదనలకు సాక్ష్యంగా నిలుస్తాయి. 

రైతుల్లో నిర్లిప్తత, నిరాసక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయునడానికి రుజువుగానే హరిద్వార్ నుం చి న్యూఢిల్లీకి భారతీయ కిసాన్ యూనియన్ నిరసన లు నిలుస్తాయి. వారు చేస్తున్న 15 డిమాండ్లలో కనీసం ఆరు డిమాండ్లు వ్యవసాయురంగంలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించినవే. వాటి చుట్టూ తిరిగేవే. పదేళ్ల నుంచి వినియోగంలో ఉన్న ట్రాక్లర్ల ప్రవేశ నిషేధాలను ఎత్తివేయడం వంటి చిన్నచిన్న స్థానిక అంశాల నుంచి వ్యవసాయ ఉపకరణాలపై విధించిన ఐదుశాతం జీఎస్‌టీని ఉపసంహరించాలన్న ప్రధాన డిమాండ్ వరకున్నాయి. వీటికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన వచ్చింది. అయితే, డిమాండ్లలో సూ చించిన ప్రధాన ఆర్థిక అంశాలు అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో చేసిన నిరసనల వల్ల ఎలాం టి ప్రతిఫలం అందకపోయిన విషయం గవునార్హం. 
దేశవ్యాప్తంగా నిరసనలకు ప్రధాన కారణంగా చె ప్పుకోవలసిన డిమాండ్లు రెండున్నాయి. అందులో ఒక టి రుణమాఫీ కాగా, రెండోది స్వామినాథన్ కమిషన్ సిఫారసుకు అనుగుణంగా మద్దతు ధరకు మరో 50 శాతం కలిపి అందిస్తామని ప్రభుత్వం స్వయంగా చేసిన వాగ్దానం. ఉత్పత్తుల ధర నిర్ణయించే ముందు రె ట్టింపు చేయడం పోయి చర్య తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంటుంది. సమగ్ర ఖర్చుకు (ఇ2) వ్యతిరేకంగా రైతులు చెల్లించిన ఖర్చులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటోంది. కుటుంబ శ్రమను (అ2+ఊఔ) కూడా చేర్చడం ఇ2లో ఉండవలసినది. వరికి సేకరణ ధరగా క్వింటాల్ 1,750 రూపాయులుగా ప్రభుత్వం ప్రకటించింది. అదే స్వామినాథన్ ఫార్ములా ప్రకారం లెక్కకడితే, క్వింటాల్ వరి 2,340 రూపాయులుగా ఉం టుంది. అంటే ప్రతి క్వింటా వరికి 590 రూపాయలు నష్టపోవాల్సి వస్తోందన్నమాట. అదే విధంగా మొక్కజొన్న విషయంలో క్వింటాకు 540 రూపాయల నష్టం భరించాల్సి వస్తోంది. 

మొత్తం సేకరించే 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రభుత్వం వద్ద వనరు లు లేవనడం సరైనది కాదు. అంచనాల ప్రకారం యే టా కనీస మద్దతుధర ప్రకటించడానికి లక్షకోట్ల రూపాయులు అవసరవువుతాయి. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయునేది ప్రధానప్రశ్న. రైతులకు తక్షణ సాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే 2008-09లో ఆర్థిక రంగం కుదేైలెన తరువాత పారిశ్రామిక రంగానికి ప్రకటించిన 1.86 లక్షల కోట్ల ఉద్దీపన చర్యల్ని వెంటనే నిలిపివేయాలి. ప్యాకేజీని పదేళ్ల కాలపరిమితిలో పూర్తిచేయాలి. గత నాలుగు దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంతో రైతుల ఆదాయం దాదాపు స్తంభించిన నేపథ్యంలో ఇన్ని సం వత్సరాల్లో తమకు రావలసిన ఆదాయం అందకుండా రైతులకు నిరాకరించడం అన్యాయం. వ్యవసాయంలో అగ్రభాగంలో నిలిచే పంజాబ్ వంటి రాష్ట్రంలో 98 శా తం వ్యవసాయు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయుని పలు అధ్యయునాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ 98 శాతం కుటుంబాల్లో 94 శాతం మంది ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కావడంతో అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. దేశం మొత్తం మీద వ్యవసాయ రుణాలు 12.60 లక్షల కోట్ల రూపాయులుంటాయి. పార్లమెంట్‌కు ప్రభుత్వం సవుర్పించిన నివేదిక వల్ల వెల్లడవుతోంది. 

దీన్ని రుణాల 10.3 లక్షల కోట్ల రూపాయల ఎగవేతలతో పోల్చిచూస్తే, ఇప్పటికే 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ మధ్యకాలంలో 3.16 లక్షల కోట్ల కార్పొరేట్‌లకు సంబంధించిన 3.16 లక్షల కోట్ల రూపాయల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) రద్దుచేశారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలన్న డిమాండ్ ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆర్థికవేత్తలు, విధానకర్తలు, వ్యాపారవేత్తలు అది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిస్తుం టారు. అయితే, విచిత్రంగా పారిశ్రామికవేత్తలకు సం బంధించిన నిరర్థక ఆస్తుల్ని రద్దుచేసినప్పుడు ఎటువం టి అడ్డంకులు, అభ్యంతరాలు ఎవరూ చెప్పరు. ఆ వి ధంగా ఆర్థిక విధానాలను ఎంతో తెలివిగా రూపొందిం చారో స్పష్టవువుతోంది. అంటే ఆర్థిక విధానాలన్నిం టిలో కీలకభూమిక పోషిస్తున్న నేటి నయా ఉదార ఆర్థిక విధానాల కారణంగా వ్యవసాయురంగం ఎంతగా కుంగిపోతోందో తెలుస్తోంది. అదే రైతులోకం ఒత్తిళ్లలోను, ఆందోళనలోను మిగిలిపోవడానికి కారణవువుతోంది. దేశంలో అత్యంత ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యవసాయం మాత్రమే ఆర్థిక వ్యవస్థకు తిరిగి పూర్వైవెభవంలోకి తెచ్చే శక్తి కలిగివున్నది. అదే మహాత్ముడు చెప్పింది... మనం విస్మరించింది.

- దేవీందర్ శర్మ
ఆహార, వ్యవసాయునిపుణుడు
(ద ట్రిబ్యూన్ సౌజన్యం)

English Title
'Naya' financial system
Related News