జైలులో షరీఫ్‌కున్న సదుపాయాలివే!

Updated By ManamSat, 07/14/2018 - 16:36
nawaz sharif
nawaz shariff

స్లామాబాద్: ఓ చిన్న గది, అందులో ఓ మంచం, ఒక కుర్చీ, ఓ చెంబు ఇంకా కరెంట్ సదుపాయం లేకుంటే ఓ లాంతరు.. ఇదీ పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌కు ప్రస్తుతం జైలులో కల్పించిన సౌకర్యాలు. శుక్రవారం షరీఫ్ తన కూతురుతో కలిసి లాహోర్ విమానాశ్రయంలో అడుగు పెట్టీపెట్టక ముందే పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

విమానంలోకి వెళ్లిన పోలీసు బలగాలు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రత్యేక ఎస్కార్టుతో రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాయి. జైలులో షరీఫ్‌కు బి క్లాస్ ఖైదీ సదుపాయాలు కల్పించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఖైదీలను వారు చేసిన నేరాన్ని బట్టి కాకుండా సమాజంలో వారి హోదాను బట్టి ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఏ క్లాస్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించనుండగా.. బి క్లాస్ ఖైదీకి కేవలం ఓ మంచం, కుర్చీ, ఓ చెంబు మాత్రమే అందుబాటులో ఉంటాయి. న్యాయస్థానం అనుమతితో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వార్తా పత్రికలు.. సదుపాయాలను(వాటి నిర్వహణ వ్యయాన్ని భరించే ఒప్పందం మీద) ఖైదీలకు సమకూర్చే అవకాశం ఉంది. 

ఈ బీ క్లాస్ ఖైదీలు సాధారణంగా చదువుకున్న వారే అయ్యుంటారు కాబట్టి వారితో సీ క్లాస్ ఖైదీలకు చదువు చెప్పిస్తారు. అడియాలా జైలులో పటిష్ఠమైన భద్రత మధ్య ఉంటుందట. పనామా పేపర్స్ కేసుతో పదవీచ్చుతుడైన షరీఫ్.. లండన్‌లో అక్రమాస్తుల కేసులో కూతురుతో సహా ప్రస్తుతం జైలుపాలయ్యారు. ఈ కేసులో షరీఫ్, ఆయన కూతురు మరియంకు కోర్టు వరుసగా పదేళ్లు, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, తొలుత నవాజ్ షరీఫ్‌ను దేశ రాజధానిలోని ఓ రెస్ట్‌హౌస్‌కు తరలిస్తారని, దానినే సబ్ జైలుగా ప్రకటించి అందులోనే ఉంచుతారనే పుకార్లు వినిపించాయి. అదేమీ లేకుండా రావల్పిండిలోని అడియాల జైలుకు తరలించడం.. పైపెచ్చు షరీఫ్‌ను బి క్లాస్ ఖైదీగా ప్రకటించడంపై పాక్‌లో నిరసన వ్యక్తమవుతోంది.

English Title
Nawaz Sharif Qualify For Class B Cells In Pakistan Jail
Related News