నవాజ్ షరీఫ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Updated By ManamFri, 07/13/2018 - 10:55
 Nawaz Sharif, daughter Maryam, arrested arrival in Pakistan
  • పాకిస్థాన్‌లో అడుగుపెట్టగానే  అదుపులోకి తీసుకొనే అవకాశం 

  • ఎవెన్‌ఫీల్డ్ కేసులో నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్‌కు జైలుశిక్ష 

 Nawaz Sharif, daughter Maryam, arrested arrival in Pakistanలండన్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్‌ను అరెస్ట్ చేసేందుకు యూఏఈ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. యూఏఈలోని అబు ధాబి విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం అడుగుపెట్టిన వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకోనున్నారు. ఎవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్ కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్ష, కుమార్తె మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరిని అబు ధాబి విమానాశ్రయంలో ఏడుగంటల పాటు వేచిఉండనున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం 6.15 గంటల (యూకే కాలమానం ప్రకారం 2.15 గంటలు) ప్రాంతంలో లాహోర్‌కు చేరుకోనున్నారు. 16 సభ్యుల నేషనల్ అకౌంటాబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) బృందం ఇప్పటికే షరీఫ్, మర్యమ్‌ అరెస్ట్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుంది.

పాకిస్థాన్ చేరుకోగానే వారిద్దరిని ముందుగా ఇస్లామాబాద్‌లోని అడియాలా జైల్లో ఒకరోజు ఉంచనున్నారు. మరుసటి రోజున ఇద్దరిని అటాక్ ఫోర్ట్ జైలుకు తరలించనున్నారు. ఎవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్ కేసులో ఈ నెల 6న పాక్ మాజీ ప్రధాని నవాజ్‌కు 10ఏళ్ల జైలు శిక్షతో పాటు ఎనిమిది మిలియన్ పౌండ్ల జరిమానాను అకౌంట్‌బిలిటీ కోర్టు విధించింది. నవాజ్ కొనుగోలు చేసిన ఎవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట‌్లను తన కుమార్తె మర్యమ్‌‌కు కట్టబెట్టినట్టు విచారణలో తేలింది. దాంతో కుమార్తె మర్యమ్‌కు కూడా కోర్టు రెండు మిలియన్ల పౌండ్స్ జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 

English Title
Nawaz Sharif, daughter to be arrested on arrival in Pakistan
Related News