‘హరితమే నా ఖడ్గం’

Updated By ManamMon, 06/04/2018 - 00:01
image

image‘మెరుగైన జీవన పోరాటం కోసం హరిత ఖడ్గం చేపట్టాను. మీరూ దాన్ని చేబూనండి’ అంటూ నినదిస్తూ 107 ఏళ్ళ వయ సులోనూ అలుపెరుగక పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి నాయ కత్వం వహిస్తున్న పర్యావరణ యోధురాలు సాలుమరద తిమ్మక్క జీవితం ఆదర్శనీయం. కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న ఈ పర్యా వరణవేత్త బీబీసీ రూపొందించిన ప్రతిభాశీలురైన, స్ఫూర్తి ప్రదాత లైన ‘వందమంది మహిళలు-2016’ జాబితాలో ఒకరుగా నిలి చారు. ‘సాలుమరద’ అనే పదానికి కన్నడ భాషలో ‘మర్రి వృక్షాల వరుస’ అని అర్థం. శతాధిక వయసున్న తిమ్మక కర్ణాటకలోని హు లికల్ - కుడూర్ మధ్య నాలుగు కిలోమీటర్ల పొడవున 400 మర్రి చెట్లను నాటి, కన్నబిడ్డల వలె వాటిని సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తుండడం పర్యావరణ ప్రేమికులకు స్ఫూర్తిదాయకం గా నిలిచింది. 80 ఏళ్ళలో ఆమె 8 వేలకు పైగా చెట్లను నాటి చరిత్ర సృష్టించారు. 

కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని గుబ్బి గ్రామంలో నిరుపేద కుటుంబంలో తిమ్మక్క జన్మించారు. ఆమె ఎన్నాడూ బడి మొహం చూడలేదంటే ఆశ్చర్యమే. 10 ఏళ్ళకే కుటుంబ పోషణ కోసం బాల కార్మికు రాలిగా కూలికి వెళ్ళవలసిన దుస్థితి. రామానగర్ జిల్లాకు చెంది బేకాల్ చిక్కయ్యను వివాహం చేసుకున్న తిమ్మక్కకు చాలాకాలం సంతానం కలగలేదు. సంతానలేమితో బాధపడుతున్న ఆ దంప తులు తమ సంతానంగా చెట్లను భావించారు. వాటిని రహ దారుల వెంట నాటే చెట్ల ను నాటే బాధ్యతను చేపట్టారు. స్థానిక imageజర్నలిస్టు రాసిన తిమ్మక్క పర్యా వరణ పరిరక్షణ కథనాన్ని ఆనాటి ప్రధాన మంత్రి హెచ్‌డి దేవ గౌడ కంటపడింది. దాంతో 1995 నేషనల్ సిటిజెన్స్ అవార్డును ఆమెను వరించింది. 1997 - ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు, 1997 - వీరచక్ర ప్రశస్తి అవార్డు, 2010 హంపీ విశ్వవిద్యాలయం - నదోజ అవార్డు,  2000 కర్ణాటక కల్పవల్లి అవార్డు, 2006 గాడ్‌ఫ్రే ఫిలిప్స్ పురస్కారం, 2015 హూవినా హోల్ ఫౌండేషన్ విశ్వాత్మ అవార్డు, గ్రీన్ చాంపియన్ అవార్డు, వృక్షమాత అవార్డు తదితర అనేక పురస్కారాలు తిమ్మక్క పర్యావరణ కృషికి తార్కాణంగా నిలుస్తాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, ఓక్‌ల్యాండ్, కాలిఫోర్నియా కేంద్రంగా ‘తిమ్మక్క రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్’ అనే సంస్థను కూడా స్థాపించారు. ఒక మట్టిమనిషి, ఒక సామాన్యురాలు తిమ్మక్క ప్రకృతి ప్రేమికురాలిగా, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి ప్రదాతగా ఈ ప్రపంచానికే సందేశ మిచ్చే స్థాయి అసామాన్యరాలుగా ఎదిగారు.

భూతాపం కారణంగా ఆకస్మిక వాతావరణ మార్పులు సంధి దశకు భూగోళం చేరుకుంటున్న తరుణంలో తిమ్మక్క జీవితం భవిష్యత్ తరాలు మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజా నికి -ప్రకృతి మధ్య ఆదానప్రదాన క్రమానికి గండిపడకుండా చూసుకోవల్సిన బాధ్యత ప్రధానంగా మనిషిదేనన్న ఎరుకను కలి గి ఉండాలి. యుద్ధప్రాతిపదికన పర్యావరణ పరిరక్షణ పునాదిగా వ్యవసాయ - పారిశ్రామిక విధానాల రూపకల్పన చేయవలసిన తరుణమిది. ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ పక్షాలు ఉమ్మడిగా పర్యావరణ పరిరక్షణ కార్యకలాపా న్ని తక్షణ కార్యాచరణగా చేపట్టాలి. మానవాళి మనుగడ ప్రశ్నా ర్థకంగా మారుతున్నవేళ తిమ్మక్క జీవితం, కృషి వెలుగులో మని షి-ప్రకృతి మధ్య నున్న సారూప్య-సారూప్యరాహిత్య సంబంధాన్ని మానవజాతి మరింత సజీవంగా ప్రతిఫలించగలగాలి. 
మాదిరాజు సునీత

English Title
nature is my sword
Related News