గీత, బబితాలపై వేటు

Updated By ManamThu, 05/17/2018 - 15:34
geeta, babita

geeta, babita భారత స్టార్ రెజ్లింగ్ సోదరీమణులు గీత సింగ్ ఫొగట్, బబిత కుమారిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేటు వేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేషనల్ క్యాంపుకు వీళ్లు హాజరుకాకపోవడంపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేశారు. ఈ ఇద్దరితో పాటు వారి చెల్లెళ్లు రీతూ, సంగీతాలను కూడా నేషనల్ క్యాంపు నుంచి బహిష్కరించింది ఫెడరేషన్.

అయితే నేషనల్ క్యాంపుకు ఎంపికైన అందరు రెజ్లర్లందరూ మూడు రోజుల్లోపు వ్యక్తిగతంగా హాజరు అవ్వాలి. వారికి ఏదైనా సమస్య ఉంటే కోచ్‌లకు చెప్పి పరిష్కరించుకోవాలి. కానీ గీతా, బబితా ఏ సమాచారం ఇవ్వకుండా గైర్హాజరవ్వడంతో వారిపై వేటు వేసినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ తెలిపారు. కాగా.. నేషనల్ క్యాంప్ నుంచి బహిష్కరించారంటే ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా వాళ్లు కోల్పేయే అవకాశం ఉంది. అయితే వారు సంతృప్తికర వివరణ ఇవ్వగలిగితే మళ్లీ నేషనల్ క్యాంపును అనుమతించే అవకాశం ఉందని బ్రిజ్ భూషన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే బహిష్కరణపై స్పందించిన బబిత, గాయం కారణంగానే క్యాంప్‌కు వెళ్లలేకపోయానని చెప్పింది. ఈ వివరణను ఫెడరేషన్ ఇస్తానని స్పష్టం చేసింది. ఇక గీత బెంగళూరులో ప్రైవేట్ శిక్షణ తీసుకుంటుందని, ఆమె ఎందుకు రాలేదన్న విషయం మాత్రం తెలీదని పేర్కొంది.

 

English Title
National Wresteling Federation bars on Geetha, Babita
Related News