ఎన్నికల రోజు.. తెలుగులో మోదీ ట్వీట్

Narendra Modi

న్యూఢిల్లీ: తెలంగాణలో 119 అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం అవ్వగా.. పలువురు తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. కాగా ఎన్నికల రోజున ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ట్వీట్ చేసి, అందరూ ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

‘‘ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను.... ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాను’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

https://twitter.com/narendramodi/status/1070868270285246464 

సంబంధిత వార్తలు