'కక్షసాధింపు కోసమే ఐటీ దాడులు'

Updated By ManamMon, 10/08/2018 - 21:12
Nara Lokesh babu, Central govt, IT Raids

Nara Lokesh babu, Central govt, IT Raidsఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై కక్షసాధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐటీ దాడులు జరగలేదని అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 19 బృందాలు, 200 మంది సిబ్బంది రావడం వల్లే తమకు అనుమానం వస్తోందని చెప్పారు. ఇదే విషయంలోనే మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విషయం తెలుస్తోందన్నారు.

గతంలో ఐటీ దాడులు జరిగినా తాము స్పందించలేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిపై దాడులు జరపడం వారిని బయపెట్టడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం కాదా? అని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. 

English Title
Nara Lokesh babu slams Central govt
Related News