అందుకే ఎన్టీఆర్‌ను ప్రచారానికి రావద్దన్నా...

Jr.NTR Balakrishna (408), Nandamuri Suhasini (378), kukatpally (60), election campaign (330)

హైదరాబాద్ : కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి సుహాసిని తరఫున ఆమె సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి గల కారణాలను నందమూరి బాలకృష్ణ వివరించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో అంచెలంచెలు ఎదుగుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో అతడు ఎన్నికల ప్రచారానికి వస్తే కొంతమంది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అందులోను జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు. ఆ భయంతోనే నేను  ప్రచారానికి రావద్దు అని చెప్పా. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణ కొడుకు కాదు... నాకు కూడా కొడుకే. అందుకే ఎన్నికల ప్రచారానికి రానివ్వలేదు. ఇక నా కొడుకు మోక్షజ్ఞ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదో .. జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు.

నేను ఇప్పటికే ఎమ్మెల్యే గా ఉన్నా. సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ మొత్తం చూసేసాను. అందుకే రాజకీయాలు, సినిమాలు రెండు బ్యాలన్స్ చేయగలుగుతున్నాను. రాజకీయాలలో సుహాసినిది నాది ఒక్కటే మార్గం. జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ది ఒకటే మార్గం. అందుకే మేము వేరు... వాళ్ళు వేరు అంటూ’ వివరణ ఇచ్చారు. జీవితంలో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు ఈ విషయాన్ని నేను మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వద్ద నుండి నేర్చుకున్నాను అని బాలకృష్ణ పేర్కొన్నారు. కాగా సుహాసిని తరఫున నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణతో పాటు తారకరత్నతో పాటు కల్యాణ్ రామ్ భార్య కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు