కోర్టులో లొంగిపోయిన మాజీ జడ్జి గాంధీ

Updated By ManamTue, 07/10/2018 - 16:47
gandhi

gandhiహైదరాబాద్ : లేబర్ కోర్టు మాజీ ప్రిసైడింగ్ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ మంగళవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 11 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో, చంచలగూడ జైలుకు తరలించారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడ్డి అనంతరం గాంధీ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే గాంధీ బెయిల్‌ను సుప్రీంకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయన కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా అక్రమాస్తుల కేసులో గాంధీని ఏసీబీ అధికారులు ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు.

English Title
Nampally Labour Court former Judge gandhi surrenders in ACB court
Related News