కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఓదేలు

Updated By ManamFri, 09/14/2018 - 09:24
KCR, Odelu

KCR, Odeluహైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం సీటు తనకు ఇవ్వకుండా బాల్క సుమన్‌కు ఇవ్వడంపై అలకబూనిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తాజాగా సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం మాట్లాడిన ఓదేలు.. కేసీఆర్ మాటే తమకు శిరోధార్యమని.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. 

కేసీఆర్‌తో కలిసి జీవిత కాలం పని చేస్తానని.. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని.. బాల్క సుమన్ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. 

English Title
Nallala Odelu met KCR
Related News