బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రంలో నాగ్..?

Updated By ManamTue, 07/10/2018 - 09:47
Nagarjuna

Nagarjuna‘క్రిమినల్’, ‘ద్రోహి’, ‘జక్మ్’, ‘ఎల్‌వోసీ కార్గిల్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌కు సుపరిచితుడైన అక్కినేని నాగార్జున.. చాలా కాలం తరువాత మళ్లీ అక్కడ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ నిర్మాణంలో అమితాబ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న బ్రహ్మాస్త్రలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ముంబైలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో నాగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.

ఇటీవలే నాగార్జునను కలిసి బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమా కథ చెప్పడం, అది నాగ్‌కు నచ్చడం జరిగిపోయానని, పైగా ఆ చిత్రంలో బిగ్‌బీ నటిస్తుండటంతో నాగ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా తెలుగులో నానితో కలిసి నాగార్జున దేవదాసు అనే చిత్రంలో నటిస్తుండగా.. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Nagarjuna in Bollywood Huge Budget Movie..?
Related News