దేవదాస్ రివ్యూ

Updated By ManamThu, 09/27/2018 - 16:03
Devadas Movie Review

చిత్రం : దేవదాస్
బ్యాన‌ర్‌: వైజ‌యంతీ మూవీస్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా, కునాల్ క‌పూర్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, వెన్నెల‌కిషోర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, స‌త్య త‌దిత‌రులు
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
కెమెరా: శ్యామ్‌ద‌త్ సైనూద్దీన్‌
ఆర్ట్: సాహి సురేశ్‌
ప్రొడ్యూస‌ర్‌: అశ్వినీద‌త్ చ‌ల‌సాని
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌

Nagarjuna Devadas Movie Review

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ చల‌సాని ఓ సినిమాను నిర్మిస్తున్నారు.. అందులోనూ అది మ‌ల్టీస్టార‌ర్‌.. నాగార్జున‌, నాని క‌లిసి చేస్తున్నారు... అనే మాట విన‌గానే టాలీవుడ్‌లో బ‌జ్ మొద‌లైంది. కొన్నాళ్లు ఆ సినిమా మ‌రో ఫారిన్ చిత్రానికి రీమేక్ అనే ప్ర‌చారం కూడా సాగింది.

అయితే ఎట్ట‌కేల‌కు గురువారం విడుద‌లైంది ఈ సినిమా. `దేవ దాస్‌`గా విడుద‌లైన ఈ సినిమాకు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన `దేవ‌దాస్‌`తో ఏమాత్రం సంబంధం లేదు. ఇందులో నాగార్జున దేవ‌గానూ, నాని దాస్‌గానూ న‌టించారు. మ‌రి ఈ న‌యా దేవ‌దాస్ ఎలా ఉంటుందో హావ్ ఎ లుక్‌...

క‌థ‌

Devadas Movie Review

దేవా (నాగార్జున‌) పెద్ద డాన్‌. ఎవ‌రికీ క‌నిపించ‌డు. కానీ త‌న చ‌ర్య‌ల‌తో లోక‌ల్ డాన్స్ ని ఉడికిస్తుంటాడు. అత‌ని నుంచి విముక్తి క‌ల్పించుకోవాల‌ని అనుకున్న లోక‌ల్ డాన్స్ అంద‌రూ క‌లిసి ఓ సిండికేట్‌గా త‌యార‌యి దేవాను పెంచుకున్న తండ్రిని చంపేస్తారు. అప్పుడు దేవా సిటీలోకి ఎంట‌ర్ అవుతాడు. యాక్సిడెంట‌ల్‌గా అత‌ని ఛాతీలో బుల్లెట్ దిగుతుంది. అత‌ను వెతుక్కుంటూ వెళ్లిన డాక్ట‌ర్ పేరు దాస్ (నాని). ప‌ల్లెటూరి నుంచి ప‌ట్ట‌ణానికి వ‌స్తాడు డాక్ట‌ర్ దాస్‌. త‌న అన్న కుటుంబంతో ఉంటూ సిటీలో ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అయితే కార్పొరేట్ ఆసుప‌త్రుల ప‌ద్ధ‌తి అంతుచిక్క‌క అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డి, త‌న అన్న ఉంటున్న ఏరియాలోనే ఓ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తాడు. స‌రిగా అక్క‌డే ఆయ‌న దేవాకు ట్రీట్‌మెంట్ చేస్తాడు. ఆ స‌మ‌యంలోనే దేవాకి జాహ్న‌వి, దాస్‌కి పూజా ప‌రిచ‌య‌మ‌వుతారు. వారి లవ్ చేప్ట‌ర్లు ఓపెన్ అవుతాయి. త‌న‌కు మాత్ర‌మే తెలిసిన దేవాని పోలీసుల‌కు దాస్ ప‌ట్టించాడా?  లేదా?  దాస్ స్నేహం వ‌ల్ల దేవాలో వ‌చ్చిన మార్పులేంటి? వ‌ంటివి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పూజా దాస్‌ని నిజంగా ప్రేమించిందా? ఆమెకు అత‌నిలో ఏం న‌చ్చింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు. 

విశ్లేష‌ణ‌
`శ్రీరామ్ ఆదిత్య మ‌రీ రెండు రోజుల ముందు సినిమాను చూపించాడు. అదే నెల రోజుల ముందు చూపిస్తే ఏమైనా మార్పులుంటే చెప్ప‌గ‌లం` అని నాగార్జున ప్రెస్ ముందు అన్న‌ప్ప‌టి నుంచీ `దేవ‌దాస్ ` సినిమా అనుకున్నంత బాగా రాలేదా ఏంటి?.. అలా ఎందుక‌న్నారు అనేది చ‌ర్చ‌కింద మారింది. ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది దీని గురించి మాట్లాడుకున్నారు. సినిమా చూశాక ఆయ‌న ఎందుకలా అన్నారో చాలా మందికి అర్థ‌మైంది. సినిమాను ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బావుండేద‌ని ప‌లువురి అభిప్రాయం.

మ‌రీ ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలానే ఉన్నాయ‌నిపించింది. వాటిని ఇంకాస్త ట్రిమ్ చేసి క్రిస్పీగా చేసి ఉండాల్సింది. అలాగే సెకండాఫ్లోనూ ల్యాగ్‌ను త‌గ్గించాల్సింది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే నాగార్జున‌, నాని మ‌ధ్య బ్రొమాన్స్ బాగా పండింది. నిజ‌మైన ఫ్రెండ్‌షిప్‌ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ విల‌నిజాన్ని బ‌లంగా చూపించ‌లేదు. దాని ఫ‌లితం సినిమాలో కొన్ని స‌న్నివేశాలు పేల‌వంగా మారిన‌ట్టు అనిపించాయి. స్క్రీన్‌ప్లే మీద మ‌రికాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. స‌ర‌దాగా చూడాల‌నుకున్న‌వారు ఒక‌సారి చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది.

ప్ల‌స్ పాయింట్లు

  •  ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్

  •  మ్యూజిక్‌

  •  కెమెరా

  •  లొకేష‌న్స్, కాస్ట్యూమ్స్

మైన‌స్ పాయింట్లు

  •  కొత్త‌ద‌నం లేని క‌థ‌

  •  మ‌లుపులు లేని స్క్రీన్‌ప్లే

  •  ఎమోష‌న్స్ పండ‌లేదు

  •  ఎడిటింగ్‌

రేటింగ్‌: 3/5
చివ‌రిగా... `దేవ‌`..`దాస్` కోసం చూడొచ్చు

English Title
Nagarjuna and Nani's Devadas Movie Review
Related News