నా ఆస్తులు వెల్లడిస్తా..

Updated By ManamFri, 11/09/2018 - 01:40
HRD-Minister-Ganta-Srinivasarao
  • నేరుగా అడిగితే అన్ని వివరాలు ఇస్తా

  • సిట్ నివేదికలో నా పేరు లేకపోవడం సంతోషం: గంటా  శ్రీనివాసరావు

HRD-Minister-Ganta-Srinivasaraoవిశాఖపట్నం:  తన ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోగోరేవారు తనను నేరుగా సంప్రదిస్తే ..రాజకీయాల్లోకి రాకముందు నుంచీ ఇప్పటి వరకూ అన్ని వివరాలను వెల్లడిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..భూ కుంభకోణంలో తాను పెద్ద ఎత్తున లబ్ది పొందినట్టు స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను బయటపెట్టాలని తానే కోరినట్టు తెలిపారు.  ఈమేరకు 2017 జూన్ 6న సీఎంకు లేఖ రాసినట్టు..అందులోనే సిట్ నివేదికలో వేయాలని కోరానన్నారు. దీనిపై స్పందించిన సీఎం అదే నెల 16వ తేదీన సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు.  దీంతో జూన్ 28 నుంచి సిట్ విచారణ ప్రారంభించిందని గంటా వివరించారు.  కుంభకోణంలో తన ప్రమేయం లేదని సిట్ స్పష్టం చేసినందుకు సిట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  తన ఆస్తిపాస్తుల విషయమై పలువురికి అనేక రకాల అనుమానాలున్నాయన్నారు.  న్యాయ విద్య పూర్తయ్యాక రెండేళ్ల పాటు ఓ పత్రికలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేసినట్టు.. అనంతరం పలు కాంట్రాక్టులు నిర్వహించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. తన ఆర్ధిక పరిస్థితిపై లేనిపోని అవాకులు పేలితే ఇకపై ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

English Title
My assets reveal
Related News