జాతివిముక్తి పోరాటంలో ముస్లిం యోధులు

Updated By ManamWed, 08/15/2018 - 01:18
Muslim warriors in the struggle for ethnic cleansing

Muslim warriors in the struggle for ethnic cleansingశారీరకంగా, మానసికంగా, ఆలోచనాపరంగా, ఏ విధంగా చూసినా స్వేఛ్ఛా భావమన్నది మానవ నైజంలో ఉన్న ఒకానొక కాంక్ష. బానిసభావం మానవ స్వభావానికి వ్యతిరేకం. ప్రకృతి ధర్మబోధనలు, ఉపదేశాల ఫలితంగానే, ఈ ధర్మాన్ని అనుసరించే ముస్లిమ్ సమాజంలో స్వాతంత్య్ర కాంక్ష మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరి కింద బానిసలుగా బతకడాన్ని ఈ జాతి ఎట్టి పరిస్థితి లోనూ అంగీకరించదు. స్వేఛ్ఛకోసం అది నిరం తరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.  స్వాతంత్య్రకాంక్షకు బీజంవేసి, స్వాతంత్య్ర సమరానికి నాంది పలికి, దేశంకోసం ప్రాణత్యాగా లు చేసిన వారిని పక్కకు నెట్టి, ఈ ఘనత అంతా కేవలం ఒక వర్గానిదే అన్నట్లుగా ఆశక్తులు ఒక ప్రణాళికాబద్ధ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. నిజా నికిది అందరూ కలసి సాధించుకున్న సమిష్టి విజయం. కాని ఉద్యమంలో ముస్లిముల పాత్రను తొలగించ డానికి, మరీ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే బాగా తగ్గించి చూపడానికి, కావలసినన్ని ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. 

మొట్టమొదట 1757లో బెంగాల్ పాలకు డైన నవాబ్ సిరాజుద్దౌలా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమానికి బీజం వేశాడు. బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడాడు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే, మీర్ జాఫర్ ఈ స్వతంత్ర పాల కునికి ద్రోహం తలపెట్టి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు. ద్రోహపూరితమైన కుట్ర ఫలితంగా సిరా జుద్దౌలా అమరగతి పొందాడు. తరువాత ఆంగ్ల మూక మైసూరుపై దృష్టి పెట్టింది. మైసూరును వశం చేసుకోవాలని మాయోపాయాలు పన్నింది. అప్పటి మైసూరు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ అత్యంత ధైర్య స్థయిర్యాలు ప్రదర్శిస్తూ ఆంగ్ల బల గాలను అడ్డుకున్నాడు. ఈయన మరణం తరువా త, అతని కుమారుడు, వీరశూర పరాక్రమ వంతు డైన టిప్పుసుల్తాన్ 1799లో చెల్లాచెదురైన ముత్యా లను ఒకే దారంలో దండగుచ్చే ప్రయత్నం చేశాడు. స్వదేశీ పాలకులందరికీ లేఖలు రాస్తూ, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తనతో కలసి రావాల ని పిలుపునిచ్చాడు. వారు గనక టిప్పు మాటను గౌరవించి ఉంటే తాము నాడు భారత దేశంలో పాలకులుగా ఉండేవాళ్ళమే కాదుని స్వయంగా బ్రిటొష్ అధికారులే ప్రకటించారు. టిప్పు సుల్తాన్ మృతదేహాన్ని స్వయంగా చూసి, అమ రుడయ్యా డని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఆంగ్ల అధికారి జనరల్ హారీ ‘ఈ రోజు నుండి భారత దేశం మాది’ అని ప్రకటించే సాహసం చేశాడంటే టిప్పు తెల్లవాడి గుండెల్లో ఏ విధంగా రైళ్ళు పరి గెత్తించాడో అర్ధం చేసుకోవచ్చు. బ్రిటిష్ బలగా లతో వీరోచితంగా పోరాడుతూ, రణరంగంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి దేశ భక్తుడిగా టిప్పు చరిత్ర అజరామరంగా నిలిచి పోయింది. 1817లో సయ్యద్‌అహ్మద్ షహీద్ (రహ్మ), అల్లామా ఇస్మాయీల్ షహీద్ (ర)గార్లు దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి కల్పించ డానికి కంకణబద్ధులయ్యారు. ఈ యోధులిద్దరూ  ప్రాణాలకు తెగించి పోరాడుతూ 1831లో బాలా కోట్‌లో అమరగతిని పొందారు.

ఈ ఘటన తరువాత ముస్లిము సమర యోధులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినప్ప టికీ వారు స్వాతంత్య్ర కాంక్షలో తమ ధైర్య స్థయి ర్యాలను ఏమాత్రం సడలనివ్వలేదు. స్వా తంత్య్ర సాధన సంగ్రామంలోనే తాము అమర గతి పొం దాలన్న కోరికతో వారుతమ చివరి శ్వాస వరకూ పోరాడారు. ఇస్లామ్ బోధనల స్పూర్తితో 1857లో తిరుగుబాటు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతూ స్వేఛ్ఛా పతాకను చేబూని అగ్ర భాగంలో నిలిచిన వారిలో మౌలానా ఇనాయ తుల్లాహ్ సాదిక్ పురి, మౌలానా ఖాసిం నానోత్ వీలు అగ్రగణ్యులు. ఈ త్యాగ దనులు రగిలించిన స్పూర్తితో సాదిక్‌పూర్ వీధులు దేశ ప్రేమికులైన అమర వీరుల రుధిరంతో ఎ రుపెక్కాయి. చివరి కి 1857లోనే ఈ స్వాతంత్య్ర సమ ర పితామహులు మరగతులయ్యారు. జాతీయ కాంగ్రెస్ లో ముస్లిం ప్రముఖులు. ఆ తరువాత ఈ మహత్తర ఉద్యమ బాధ్యతను మౌలానా అబ్దుల్లాహ్ కస్తూరి భుజాలకెత్తుకొని, న లయ్యేళ్ళ పాటు అనుపమానమైన రీతిలో బలో పేతం చేస్తూముందుకు నడిపించారు. 1884లో మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం కొంతమంది మేధావులు, ఆలోచనాపరుల ఆధ్వర్యంలో జరి గింది. తరువాత నాల్గవ సమావేశం 1887లో  సయ్యద్ బద్రుద్దీన్ తయ్యబ్ జీ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. ఈ సభకు అందరికంటే అధిక సంఖ్యలో ముస్లిములు హాజరయ్యారు. ఆనాటి కాంగ్రెస్ ప్రముఖుల్లో జౌహర్ అలీ,షౌకత్ అలీ (అలీ బ్రదర్స్) హస్రత్ మొహానీ, డా.రఫీ అహ్మద్ కిద్వాయ్ మౌలానా సయ్యద్ హుసైన్ అహ్మద్ మదనీ,మౌలానా అబుల్ ఖాసిం సైఫ్ బనారసీ మొదలగు వారు ముఖ్యులు.

ఈవిధంగా భారతీయ ముస్లింలు తమదేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో నిరంతరం పోరాడుతూ,దేశమాత బానిస సంకెళ్ళను తునాతు నకలు చేసేక్రమంలో తమ సర్వస్వాన్నీత్యాగం చేయడానికి పరమ సంతోషంగా సిధ్ధపడి, అసా మాన్యమైన ఆదర్శాలను నెలకొల్పారు. బెంగాల్ మొదలు, కశ్మీరువరకు విస్తరించిన భూ భాగ మంతా ముస్లిమ్ సమర యోధుల రుధిరంతో ఎరు పెక్కి పోయింది. దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వ స్వాన్నీ ధారపోసి, ఇన్ని త్యా గాలు చేసిన ముస్లిము లు నేడు అనుమా నపు దక్కులతో సొంత గడ్డపైనే పరాయి వారుగా పరిగణిం చబడుతు న్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వ తంత్ర భారతావనిలో వారి హక్కులు అతి దారు ణంగా హరించబడుతున్నాయి. వారిని విదేశీయులని, విదేశీ ఏజెంట్లనీ నిందించడం జరుగుతోంది. వారిని దేశం విడిచి వెళ్ళమని కూడా బెదిరించడం జరుగుతోంది. ప్రా ణాలు ధారపోసి సాధించుకున్న స్వతంత్ర భార తంలో, స్వాతంత్య్రోద్యమంతో నామమాత్రపు సం బంధం కూడా లేని ‘పరివార్’ శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్దవిషాదం. కనీసం ముందు తరాలకైనా వాస్తవ చరిత్రను పరిచయం చేయడం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.
 యండి.ఉస్మాన్ ఖాన్
 సీనియర్ జర్నలిస్టు

English Title
Muslim warriors in the struggle for ethnic cleansing
Related News