సంగీతానికి భాషతో సంబంధం లేదు

Updated By ManamFri, 07/13/2018 - 01:40
image

imageబహుముఖ ప్రజ్ఞాశాలి అయిన యజ్ఞరామన్ తాను నేర్చిన విద్యను పదిమందికీ పంచాలనే మహోన్నతమైన ఉద్దేశ్యంతో ప్రమయాస్‌ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కూచపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం వంటి పలు రకాల కళలను నేర్పిస్తున్నారు. వింగ్ కమాండర్ యజ్ఞరామన్ తో మనం మిసిమి ముచ్చట్లు.....
ప్ర. మీరు తమిళనాడుకు చెందిన వారు కదా?  తెలుగు ఏలా నేర్చుకున్నారు? సంగీతం వైపు మక్కువ ఎలా కలిగింది?
జ. నా పేరు వింగ్ కమాండర్ మీంజు యజ్ఞా రామన్. మధురై దగ్గర కరటుపట్టిలో 1968 లో జన్మించాను. నాన్నగారు మహాదేవన్ అయ్యార్, అమ్మ గోమతి శాంతి మహాదేవన్. మా తల్లిదండ్రులకు ఐదుగురం సంతానం, అందరం అబ్బాయిలమే. నేను వారిలో రెండోవాడిని. చదువంతా మధురై దగ్గరిలోని మీంజులోనే కొనసాగింది. కానీ చిన్నతనం నుంచే తెలుగు భాష అంటే ఇష్టం, అభిమానం ఉండేది. తమిళనాడులో తెలుగు ప్రాచుర్యం లేనప్పటికీ, మా స్కూల్లో తెలుగు సెక్షన్ ఉంది. చదవడం, రాయడం రాకపోయినా వింటూ ఆనంద పడేవాడిని.  తెలుగు భోదించే టీచర్ మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఆమెను అత్త అని పిలిచేవాడిని. తనతో ఉండడం వలన తెలుగుపైన మరీంత ఇష్టం, ప్రేమ పెరిగింది. తెలుగు అనేది ఒక అందమైన భాష, మనిషిని మనస్సును తెలుగు పదాలు ఆకట్టుకుంటాయి. అంతటి అద్భుతమైనది తెలుగు భాష. ఒక మహాకవి అతను తమిళీయన్ అయినప్పటికీ సంగీతానికి అతి సరళమైన భాష తెలుగు అని, దీనిలో మాత్రమే సంపూర్ణ సంగీత స్వరాలను చూపించగలమని, 4,500 యేళ్ల క్రితమే గుర్తించాడు. మొదట గురువు అంటే మాత్రం మా అమ్మగారే. తను కూడా గాయకురాలు, కానీ సంగీతానికి సంబంధించిన బేసిక్స్ రాజలక్ష్మీ, కళ్యాణి నారాయణ స్వామి గారి దగ్గర నేర్చుకున్నాను.  తంబరంలో కళ్యాణి గారి గురుకులంలో సంగీతం నేర్చుకోవడానికి  చేరాను. తంబరం వి. సుందరేశన్ అయ్యర్ దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠశాల పోటీల్లో  హార్మోనియం పట్టుకుని పాడాను. మీంజూలో రామానుజ చారీ గారు తెలుగు నేర్పించేవారు. తను మమ్మల్ని పొందేరిలో విశ్వేందు పరిషత్ అనే పోటీలు నిర్వహిస్తే తీసుకుళ్ళాడు. 1990లో ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలో వెస్ట్రాన్, కర్ణాటిక్ , మ్యాజిక్ నేర్చుకోవడం జరిగింది. అంతకు ముందు నేను నార్త్  ఈస్ట్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో అవా ఘోష్ గారితో పాటు హిందుస్తానే, నజీల్‌గీలే, శ్యామ్ సంగీతం వంటివి నేర్చుకున్నాను. అవా ఘోష్ గారు మహా పండితుడు. సైనిక్ పాఠశాల  భువనేశ్వర్‌లో నేను ఉద్యోగరీత్య రిజిస్టార్‌గా వెళ్ళాను. ఆ పాఠశాల వారికి  ప్రత్యేకమైన గీతం లేదు. పాఠశాలకంటూ ఒక గీతం ఉండాలని హిందీలో నేనే స్వయంగా కంపోజ్ చేశాను.  

ప్ర.  ఫ్లూట్ మీరే తయారు చేసుకొని వాయిస్తారట నిజమేనా? 
జ.   అవును,  వెదురు ఫ్లూట్ నాకు నేనే తయారు చేసుకుని వాయించాను. 20 యేళ్ళ క్రితం యూటుబ్ పై ఆశక్తి లేని కాలంలో మొదట  పివిసి పైపుని ఫ్లూట్‌లాగా తయారు చేశాను. అంత మంచిగా రాలేదు. మెల్లగా నాకునేనే స్వతహాగా 10 వరకు తయారు చేసి వాయిస్తే శబ్దం సరిగ్గా రాకపోయెది. 10 దాకా చేసి దాని లోని మెళకువలు తెలుసుకుని 2000 సంవత్సరంలో వెదురుతో ఫ్లూట్ తయారు చేయడం నేర్చుకుని, దానితోనే ప్రదర్శన ఇచ్చాను. ఇదేకాదు తబలా, ఘటం, కుంజీర, వీణా, కీబోర్ట్, హార్మోనియం ఏదైన వాయిస్తాను. వాయించడంలో నా గొప్పంటూ ఏమీలేదు. ఇదంతా కూడా నాకు సరస్వతీ కటాక్షం అనే భావిస్తాను. 

ప్ర. ఏ పాటకు రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నారు? ఇటు సంగీతం కచేరీలు అటు ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం ఎలా నిర్వహించగలుగుతున్నారు?
జ. ఒకసారి రాష్ట్ర స్థాయిలో వేంకటేశ్వర సుప్రభాతంపై పోటీలు పెట్టారు.  తరుచూ మా అమ్మగారు పాడుతూ ఉండేవారు కాబట్టి నాకు కూడా కంఠస్థం. అదే సుప్రభాతం ఆ రోజు పోటీల్లో పాల్గొని పాడాను. అప్పుడే రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో అవార్డు అందుకున్నాను. మెల్లగా పాటల పోటీల్లో, సంగీత పోటీల్లో వ్యాస రచన పోటీ ల్లో పాల్లొనడం జరిగింది. నేను సర్వింగ్ ఆఫిసర్ కాబట్టి మేము పెద్దగా సన్మానాలు, బిరుదులు అలాంటివి స్వీకరించకూడదు. సకల కళా వల్లభ అని మా ఎయిర్‌లో అందరూ పిలుచుకుంటారు. నాకు ఉద్యోగరీత్యా ప్రెసిడెంట్ ఆఫి ఇండియా ఇచ్చిన ర్యాంక్ వింగ్ కమాం డర్. అదే నాకు పెద్ద పురస్కారంగా భావిస్తాను.  1998 ప్రెసిడెంట్ శ్రీ కె. ఆర్ నారాయణ డాని చేతుల మీదుగా బెస్ట్ ఆల్ రౌండర్‌గా హైదరాబాద్ దుండిగర్‌లో బహుకరించారు. ఇక ఎయిర్ ఫోర్స్ 2000, 2001,2002లో మహోత్సవ్ పేరుతో వారం రోజులు ఎయిర్ ఫోర్స్ వారికి, వారి కుటుంబీకుల కళాల కోసం కాన్నివల్ అయ్యేది. ఉద్యోగంలో కూడా అంతా నా అభిరుచిని ఆదరించడం నాకు ఆనందకరం.

ప్ర. ప్రమయాస్ గురించి చెప్పండి?
జ. కళలకు మన దేశంలో తక్కువ ఏమీలేదు. కానీ వాటిని నేర్చుకునేందుకు మన పిల్లలకు ఎంత వరకూ ప్రోత్సాహం ఇస్తున్నామనేదే ముఖ్యం. ఇప్పటి పిల్లలను చదువుకోమని ప్రోత్సహించినంతగా కళలను నేర్చుకోమని అనడంలేదు. పైగా వారికి ఏ కళను ఎంచుకోవాలి? ఎక్కడ నేర్చుకోవలనే దానిమీద సరైన అవగాహన కూడా తక్కువే. అందుకే నాకు సాధ్యమైనంతలో ఉత్సాహవంతులను ప్రోత్సహిస్తున్నాను.

Tags
English Title
Music is not related to language
Related News