మల్టీస్టారర్ టైటిల్

Updated By ManamSun, 10/21/2018 - 09:59
nagarjuna, dhanush

imageహీరో నాగార్జున మల్టీస్టారర్స్ చేయడానికి ఎప్పుడు సుముఖంగానే ఉంటారు. టాలీవుడ్‌లో ఈమధ్యకాలంలో ఎక్కువ మల్టీస్టారర్స్ చేసిన హీరో నాగార్జున అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల నానితో కలిసి దేవదాస్ చిత్రంలో నటించిన నాగార్జున తమిళ్‌లో ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు ధనుష్. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ హీరోలు. వీరితోపాటు దర్శకుడు ఎస్.జె.సూర్య, అదితిరావు హైదరి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో 15వ శతాబ్దానికి సంబంధించి ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్‌లోనే నాగార్జున కనిపిస్తారని సమాచారం. 

English Title
Multistar title
Related News