మల్టీ టాలెంటెడ్ స్టార్స్

Updated By ManamSun, 06/03/2018 - 00:01
image
image

బహుముఖ ప్రజ్ఞాశాలురు అయిన బాలీవుడ్ తారలు కేవలం నటనతోనే సంతృప్తి చెందక తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో కాసుల పంట పండిస్తున్నారు! నటననే కెరీర్‌గా కొనసాగించాలంటే అత్యధిక పోటీ ఉన్న ఈ రంగంలో కొంత కాలం వరకే తమ హవా కొనసాగుతుందని తెలిసి ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తమకు పట్టున్న రంగంలో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.  ఓవైపు వెండితెరపై సందడి చేస్తూ, వినోద రంగంలో వెలుగుతూనే మరోవైపు తమకున్న గ్లామర్ ఇమేజ్‌తో అధునాతన బిజినెస్‌లు చేస్తూ యుతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.  అదే సామాన్యులైతే.. ‘‘జీవితమంతా ఉరుకుల పరుగులమయమైపోయింది, దేనికీ టైం లేదు.. వచ్చే జీతంతో చాలీచాలని బతుకులు.. ఇంకో పార్ట్‌టైం పనిచేసుకుందామంటే.. ఎక్కడా టైమే సరిపోవడం లేద’’ని వాపోతుంటారు.. మరి బాలీవుడ్ సెలబ్స్ చూడండి ఎన్నెన్ని వ్యాపారాలు చేసేస్తున్నారో.

ఫిట్‌నెస్, యోగా, యాక్సెసరీస్, టెక్స్‌టైల్, జువెలరీ, హోటల్, పబ్.. ఇలా ఒక్కటేమిటి పలు రంగాల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు వెలిగిపోతున్నారు.  రీల్ లైఫ్‌లో యాక్టర్లుగా  రియల్ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా వీరు యువతకు ప్రేరణనిస్తున్న విధానంపై..‘మనం కుటుంబం’ స్పెషల్ స్టోరీ..

ట్వింకిల్ ఖన్నా
బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా గారాలపట్టి, యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ సతీమణి, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఓవైపు పుస్తకాలు రాస్తూ, మరోవైపు లాభదాయకంగా బ్లాగ్స్ నిర్వహిస్తూనే..ఇదంతా చాలదన్నట్టు ఇంటీరియర్ డిజైనర్‌గానూ రాణిస్తున్నారు. ఫిలిం ప్రొడ్యూసర్‌గా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తన క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి ప్రారంభించిన ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారంతో ఎప్పుడూ ఈమె బిజీనే. 

అర్జున్ రాంపాల్
హీరో, విలన్ వంటి పాత్రలను పోషిస్తూనే ఈ మిస్టర్ ఫిట్‌నెస్, లాంజ్‌ను లాభసాటిగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ‘ల్యాప్-ద లాంజ్’ పేరుతో అర్జున్ రాంపాల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

హృతిక్ రోషన్image
‘బాలీవుడ్ గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ సినిమాలు, ఎండార్స్‌మెంట్స్‌తో పాటు తన సొంత బిజినెస్ హెచ్‌ఆర్‌ఎక్స్ (ఎక్స్‌క్లూజివ్‌గా మింత్రాలో దొరుకుతుంది) బ్రాండ్ పేరుతో షూస్, చెప్పులు, బట్టలు, ఫిట్‌నెస్ బ్యాండ్స్, స్పోర్ట్స్ వేర్ ఇలా ఫిట్‌నెస్ కం హెల్త్ క్లోతింగ్ లైన్‌ను లాంచ్ చేశారు. పలువురు సెలబ్రిటీలకు హెచ్‌ఆర్‌ఎక్స్ హాట్ ఫేవరెట్ బ్రాండ్‌గా నిలుస్తోందంటే హృతిక్ వ్యాపారం ఏరేంజ్‌లో సాగుతోందో అర్థమవుతుంది.

ఫ్యాషన్ త్రయం
‘లాబెల్ లైఫ్’ అనే సంస్థను హీరోయిన్ బిపాషా బసు, ఐటెం సాంగ్స్ క్వీన్ మలైకా అరోరా, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కలిసి స్థాపించారు.  లైఫ్‌స్టైల్ అండ్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన లాబెల్‌ను వీరు నడుపుతున్నారంటే ఫ్యాషన్ ఫియస్తాలైన వీరికి కస్టమర్ల కొరత ఉంటుందా? ట్రెండీ ఫ్యాషన్స్ అంటే పడిచచ్చే వారికి అతితక్కువ కాలంలోనే ఈ బ్రాండ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

సల్మాన్ ఖాన్
image‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో బట్టలు, పలు ఫ్యాషన్ యాక్సెసరీస్ లాంచ్ చేసిన సల్మాన్ ఖాన్ వ్యాపారం సూపర్‌గా సాగుతోంది. కాగా బీయింగ్ హ్యూమన్ వ్యాపారం ద్వారా వచ్చే లాభాల్లో అత్యధిక వాటాను సంఘసేవకే సల్మాన్ వినియోగిస్తుండడంతో ఎక్కువంది ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసి, సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మాధురి డ్యాన్స్ అకాడమీ
బాలీవుడ్ నంబర్ 1 స్టార్‌గా వెలిగిన మాధురీ దీక్షిత్‌కు డ్యాన్స్ అంటే ప్రాణం. అందుకే ఆన్‌లైన్‌లో, డీటీహెచ్‌లో ‘ఆజా నచ్‌లే’ అంటూ ఔత్సాహికులకు డ్యాన్స్ నేర్పుతూ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని బెస్ట్ కొరియోగ్రాఫర్లతో అసోసియేట్ అవుతూ ఆన్‌లైన్‌లో డ్యాన్స్ కోర్సులు నేర్పుతున్న మాధురి కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారు.

దీపికా పదుకున్
బాలీవుడ్‌లో నంబర్ వన్‌లో దూసుకుపోతున్న దీపికా పదుకున్ సెల్యులాయిడ్‌పైనే కాదు బయట కూడా తన చెరిష్మాను చాటుకుంటున్నారు. ఆల్ ‘అబౌట్ యూ’ అనే (ఎక్స్‌క్లూజివ్‌గా మింత్రాలో దొరికే బ్రాండ్) పేరుతో తెచ్చిన క్లోతింగ్ లైన్ ఫ్యాషన్ ప్రియులతో వాహ్ అనిపించుకుంటోంది. ఓవైపు ‘లివ్ లవ్ లాఫ్’ అంటూ డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం చేస్తూనే మరోవైపు హాలీవుడ్, బాలీవుడ్‌లో నటిస్తూ ఇలా బిజినెస్‌లో అడుగుపెట్టడం విశేషం.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఈ శ్రీలంకన్ హాట్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ కూడా హోటల్ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇటీవలే శ్రీలంకన్ సెలబ్రిటీ షెఫ్‌తో కలిసి imageఈమె స్టార్ట్ చేసిన హోటెల్‌కు త్వరలో దేశ విదేశాల్లో బ్రాంచిలు కూడా ప్రారంభించనున్నారు. ఇది కాక ‘జస్ట్ ఎఫ్’ పేరుతో ఫిట్నెస్ బ్రాండ్‌ను లాంచ్ చేశారు. ఇప్పటికే పలు వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఈమె తన ఓన్ బ్రాండ్ ఫ్యాషన్స్‌ను లాంచ్ చేయడంతో ఆమె అభిమానులు మరింత క్రేజీగా ఈ కలెక్షన్ సొంతం చేసుకుంటున్నారు.

సుష్మితా సేన్
సెన్సేషనల్ స్టార్ , మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ‘ఐయామ్’ అనే సంస్థను స్థాపించారు. బ్యూటీ విత్ బ్రెయిన్‌గా వెలుగుతున్న సుష్మిత సుమారు డజను స్వచ్ఛంద సంస్థలతో టై అప్ అయి సమాజ సేవ చేస్తూనే మరోవైపు తన సంస్థ ద్వారా అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.

శిల్పాషెట్టీ వంటి వారు యోగా సీడీలు, పుస్తకాలు, ఐపీఎల్‌తో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారితే, సునీల్ షెట్టీ వంటివారు బట్టల వ్యాపారం, జిమ్‌ల వ్యాపారంలో స్థిరపడ్డారు. ఫిట్‌నెస్ స్టూడియోలు, రియల్ ఎస్టేట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో వీరు దూసుకుపోతున్నారు. ఇక జూహీ చావ్లా, షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటివారు ఐపీఎల్ ఫ్రాంచాయిజీలు సొంతం చేసుకోగా, అభిషేక్ బచ్చన్ వంటివారు ప్రో కబడ్డీ వంటి ఆటల్లో వ్యాపారం చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ లెజెండరీ నటులు యాక్టింగ్ స్కూళ్లు నిర్వహిస్తూ తమ వ్యాపారలను విస్తృతపరుచుకుంటున్నారు.  ఇటీవలే షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్ ప్రారంభించిన ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకు ప్రముఖులంతా కస్టమర్లుగా మారిన క్రమం చూస్తే.. మనం కూడా మనకు ప్యాషన్ ఉన్న రంగంలో రాణించాలనే కసిని రగిలించేలా చేస్తుంది. ఇక తెలుగు సెలబ్రిటీలు కూడా బాలీవుడ్ బాటలో పయనిస్తూ వ్యాపారాలు చేసేస్తున్నారు.


 

English Title
Multi Talented Stars
Related News