రామ్, దుల్కర్ మల్టీస్టారర్.. దర్శకుడు అతడేనా..?

Updated By ManamFri, 09/14/2018 - 13:38
Ram, Dulquer

Ram, Dulquerటాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు క్రేజ్  పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలలో నటించేందుకు యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, మలయాళ స్టార్  దుల్కర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రంలో తెరకెక్కనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించనున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ తమిళ, మలయాళ సినిమాలలో బిజీగా ఉన్నారు.

English Title
Multi Starrer with Ram, Dulquer Salmaan 
Related News