'పవన్‌కు కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని '

Updated By ManamSun, 07/29/2018 - 11:02
MP Kesineni nani, Central govt, PM Narendra modi, Pawan Kalyan

MP Kesineni nani, Central govt, PM Narendra modi, Pawan Kalyanఅమరావతి: ఏపీ, చంద్రబాబును టార్గెట్‌ చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ-అమిత్ షా కుట్ర పన్నుతున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరూ భాగస్వాములేనని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం విషయంలో కేంద్రం చేస్తున్న మోసం మరోసారి బయటపడిందన్నారు. రైల్వేజోన్ ఇస్తామన్న రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటనకు విరుద్ధంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం పెట్టి వారం రోజులు గడవక ముందే మోదీ ఏపీ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. నిన్నటి దాకా రైల్వే జోన్ అంశం పరిశీలిస్తున్నామని చెప్పి నేడు సాధ్యం కాదని అఫడవిట్ వేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు.

తాజా అఫడవిట్‌పై రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అసలు రైతులు అంటే తెలుసా? అని ప్రశ్నించారు.  నాలుగు రోజులు రోడ్ల మీద తిరిగి 40 రోజులు హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్‌ని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం చేస్తున్న చంద్రబాబుపై పవన్ పోరాటం చేయడం కంటే.. ఏపీ హక్కుల సాధన కోసం మోదీపై పోరాటం చేయడం మంచిదని కేశినేని నాని హితవు పలికారు. పవన్‌కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాగపూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువని చెప్పారు. నాగపూర్‌లో మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది విజయవాడకు ఎందుకు వచ్చిందని నాని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

English Title
MP Kesineni nani slams Central govt and Pawan Kalyan
Related News