పసుపుకు మద్దతు ధర కల్పించాలి

Updated By ManamMon, 06/18/2018 - 13:25
MP Kavitha Kalvakuntla ‏
  • పసుపు పంటపై ప్రత్యేక వర్క్ షాపు

  • జాతీయ స్థాయిలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి :ఎంపీ కవిత

హైదరాబాద్: పసుపు పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్పైస్‌బోర్డు ఆఫ్ ఇండియా ప్రత్యేక వర్క్‌షాప్‌‌ను సోమవారం బేగంపేటలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..పసుపు రైతులను ఆదుకునేందుకు ఈ వర్క్ షాపు జరుగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని గత 30 ఏళ్లుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారని కవిత పేర్కొన్నారు. 

MP Kavitha

మద్దతు ధర లేనందున పసుపు పసుపు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని విఙ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పసుపు రైతులకు తన వంతుగా చేయూత ఇస్తోందని తెలిపారు.  తెలంగాణలో ఇతర పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, స్పైసెస్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్ షాపులో పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్‌, ఎగుమతి తదితర అంశాలపై చర్చించనున్నారు.
 

Tags
English Title
MP Kavitha Inaugurated Turmeric board Workshop In Hyderabad
Related News